వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ తీరు సరికాదు, కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది: రజనీకాంత్, 2019 పోటీపై స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కర్ణాటక రాజకీయ డ్రామాపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. అక్కడ ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. నిన్న (శనివారం) కర్ణాటకలో జరిగిన అనూహ్య సంఘటనను చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నానని, బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్ పదిహేను రోజులు ఇవ్వడం, అందుకు బీజేపీ మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తుంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్లుగా ఉందని, బల నిరూపణ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని రజనీకాంత్ అన్నారు.

సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు అన్నారు. తన రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతూ.. తాను ఇంకా పార్టీని స్థాపించలేదని, అయినప్పటికీ తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2019 ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. వచ్చే కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలను విడుదల చేయాలని రజనీకాంత్ అన్నారు.

What happened in Karnataka yesterday was a win for democracy: Rajinikanth

కాగా, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, పార్టీని స్థాపిస్తానని చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన బీజేపీకి అనుకూలంగా పార్టీ పెడుతున్నారనే ప్రచారం సాగింది. కానీ కర్ణాటకలో బీజేపీ తీరును ఆయన తప్పుబట్టారు. దీనిని బట్టి ఆయన పార్టీలను పక్కన పెట్టి.. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా సమర్థించే సమయంలో సమర్థన, వ్యతిరేకించే సమయంలో వ్యతిరేకిస్తారని అర్థమవుతోందని అంటున్నారు.

English summary
The decision for contesting elections in 2019 will be taken at the time when the elections are announced, The party is not yet launched, but we are ready for anything. Also, it is too early to talk about any kind of alliance: Rajinikanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X