వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం తీర్పు: జయలలిత ఆస్తులు ఏమవుతాయి?

ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను, మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో జయలలిత ఆస్తులు ఏం చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. అవి ఇలా..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రస్తుత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వికె శశికళా నటరాజన్ నిర్ధారిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింది. అనారోగ్యంతో గత డిసెంబర్ ఐదో తేదీన మరణించిన జయలలితతోపాటు ఈ అక్రమాస్తుల కేసులో శశికళ, ఇలవరసు, వికె దినకరన్ తదితరులు నిందితులు.

ఇదే అక్రమాస్తుల కేసులో పోలీసులు జయలలిత నివాసం నుంచి స్వాధీనంచేసుకున్న ఆస్తులు ప్రస్తుతం బెంగళూరు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. ఈ కేసులో రూ.100 కోట్ల జరిమానా రాబట్టుకునేందుకు ఈ ఆస్తులను వేలం వేసే అవకాశం ఉన్నది. అందులో జయలలిత వాడిన 750 జతల చె్ప్పులు కూడా ఉన్నాయి. వాటితోపాటు 10,500 చీరెలు ఉన్నాయి. వాటిలో 750 చీరలు పసిడి, సిల్క్‌తో తయారుచేసినవే కావడం గమనార్హం.

ప్రస్తుతం బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆధీనంలో ఉన్న ఈ వస్తువులను ఆ నగర పోలీసులు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అక్రమాస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఆమోదించడంతో సదరు వస్తువులను జరిమానా రాబట్టుకునేందుకు తమిళనాడుకు తీసుకొచ్చి వేలం వేసే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
న్యాయస్థానం జప్తు చేసిన బంగారం విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని జయలలిత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. 1997లో విజిలెన్స్ డైరెక్టరేట్, అవినీతి నిరోధకశాఖ సంయుక్తంగా జరిపిన దాడుల్లో పలు అరుదైన, విలువైన వస్తువులు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 500 వైన్ గోబ్లెట్స్, గోల్డ్ బెల్ట్, వజ్రాభరణాలు, కడియాలు, వెండి కరవాలం తదితర వస్తువులు ఉన్నాయి.

2015లో జయలలిత ఆస్తుల విలువ...

2015లో జయలలిత ఆస్తుల విలువ...

2015 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.113.73 కోట్లు. ఆమె ఆస్తులపై జయ కుటుంబ సభ్యులు హక్కు ఉందని ప్రకటిస్తారా? లేదా? చూడాల్సి ఉంది.

పోయెస్ గార్డెన్ వేదనిలయం.

పోయెస్ గార్డెన్ వేదనిలయం.

చెన్నై నగరంలో వేద నిలయంగా పిలిచే జయ నివాసం ‘పొయెస్ గార్డెన్' 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరివేష్టితమై ఉంది. దాని ప్రస్తుత విలువ రూ.43.96 కోట్లు. 1967లో జయ లలిత తల్లి రూ.1.32 లక్షలకు ఈ స్థలం కొనుగోలుచేశారు. అన్నాడీఎంకే వర్గాల కథనం ప్రకారం పోయెస్ గార్డెన్స్‌కు వారసులుగా శశికళా నటరాజన్ కుటుంబం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం.. పోయెస్ గార్డెన్ ను స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీచేశారు.

తెలంగాణలో ఫామ్ హౌస్...

తెలంగాణలో ఫామ్ హౌస్...

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. 1968లో ఈ పొలాన్ని జయలలిత కొనుగోలుచేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని చెయ్యూర్ గ్రామంలో 3.43 ఎకరాల భూమి ఉన్నది. దీన్ని జయలలిత తల్లి సంధ్య 1981లో కొనుగోలు చేశారు. వీటితోపాటు హైదరాబాద్ నగరంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ సహా నాలుగు భవనాలకు జయలలిత యజమాని. వీటిలో ఒకటి శశికళ మేనల్లుడు, తన దత్తపుత్రుడు వీఎన్ సుధాకరన్‌కు దారదత్తం చేశారు.

జయలలిత పేర ఉన్న వాహనాలు...

జయలలిత పేర ఉన్న వాహనాలు...

తమిళనాడు మాజీ సీఎం జయలలిత పేరిట తొమ్మిది వాహనాలు ఉన్నాయి. వాటిలో రెండు టొయోటో ప్రాదో ఎస్‌యూవీ, ఒక టెంపో ట్రావెల్లర్, ఒక టెంపో ట్రాక్స్, మహేంద్ర జీప్, 1980 నాటి అంబసడార్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మజడా మాక్సీ, 1990 మోడల్ కాంటెస్సా కారు. వీటి మొత్తం విలువ రూ.42.25 లక్షలు ఉంటుంది.

ఇబ్బడి ముబ్బడిగా ఆభరణాలు...

ఇబ్బడి ముబ్బడిగా ఆభరణాలు...

తమిళనాడు మాజీ సీఎం జయలలిత వద్ద 21,280.300 గ్రాముల పసిడి ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ ఇంకా నిర్ధారించలేదు. ఇవన్నీ ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు నగర న్యాయస్థానం ఆధీనంలో ఉన్నాయి. ఇక రూ. 3,12,50,000 విలువైన 1,250 గ్రాముల వెండి తన వద్ద ఉన్నదని ఆమె ప్రకటించారు.

ఐదు సంస్థల్లో జయలలిత పెట్టుబడులు

ఐదు సంస్థల్లో జయలలిత పెట్టుబడులు

పురుచ్చితలైవి ఐదు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి భాగస్వామిగా ఉన్నారు. ఆ పెట్టుబడుల విలువ రూ.27.44 కోట్లు. ఆమె పెట్టుబడులు పెట్టిన సంస్థల వివరాలివి: శ్రీ జయ పబ్లికేషన్స్, సాసి ఎంటర్ ప్రైజెస్, కొదానద్ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరిటెక్ ఎక్స్ పోర్ట్స్, గ్రీన్ ట్రీ ఎస్టేట్. 2015 - 16 వరకు ఆమె ‘ఐటీ' రిటర్న్స్ దాఖలు చేశారు. 2013 - 14 వరకు ఆస్తుల అంచనా వివరాలు సమర్పించారు. ఇక ఆమె చివరిసారిగా చేసిన ప్రకటన ప్రకారం రూ.2.04 కోట్ల విలువైన ఆస్తులు, చేతిలో రూ.41 వేల నగదు ఉన్నట్లు తెలుస్తున్నది.

English summary
The Supreme Court on Tuesday held that the trial court was right in convicting former Tamil Nadu chief minister Jayalalithaa, AIADMK interim general secretary Sasikala and two others in the disproportionate assets case. The case against Jayalalithaa was abated since she is deceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X