వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్‌.. ఇంటర్నెట్‌లో ఇండియన్స్ ఏం వెతుకుతున్నారో తెలుసా.. ఇదిగో గూగుల్ రిపోర్ట్..

|
Google Oneindia TeluguNews

కరోనా దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా రెక్కలు తెగిపోయిన పక్షుల్లా ఫీలవుతున్నారు. మునుపటిలా రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం లేదు.. కామన్ అడ్డాల్లో స్నేహితులతో ముచ్చట్లకు ఛాన్సే లేదు. బయటకెళ్తే పోలీసులు కొడుతారని కాదు గానీ చాలామంది రియాలిటీని అర్థం చేసుకున్నారు. బుద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. బోర్ ఫీలింగ్ వెంటాకుండా ఇంటర్నెట్‌తో టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్‌లో భారతీయులు ఎక్కువగా వేటి గురించి సెర్చ్ చూశారో గూగుల్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.

Recommended Video

Coronavirus Created By Chaina In Wuhan Labs - Donald Trump | Oneindia Telugu
పానీపురి సెర్చ్ ఎంతలా పెరిగిందంటే..

పానీపురి సెర్చ్ ఎంతలా పెరిగిందంటే..

లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమవడం.. హోటల్స్,రెస్టారెంట్స్,బేకరీలు అన్నీ మూతపడటంతో చాలామంది తమ ఫేవరెట్ ఫుడ్స్‌ని మిస్ అవుతున్నారు. అలాంటివాటిల్లో 'పానీ పురి' ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. లాక్ డౌన్‌లో గూగుల్‌లో 'పానీపురి' సెర్చ్ 107శాతం పెరిగింది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కడా డికాషన్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ అని ప్రధాని మోదీ చెప్పడంతో.. గూగుల్‌లో దాని సెర్చ్ కూడా 90శాతం మేర పెరిగింది.

సీ విటమిన్ గురించి తెలుసుకోవడానికి..

సీ విటమిన్ గురించి తెలుసుకోవడానికి..

గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో 56శాతం ఆహార సంబంధితమైనవే ఉన్నాయి. 5 నిమిషాల నిడివితో ఉన్న ఫుడ్ రెసిపీ వీడియోలను గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేశారు.మొత్తంగా గత కొద్ది నెలల్లో యూట్యూబ్‌లో రెసిపీ సంబంధిత సెర్చ్ భారత్‌లో 20శాతం పెరిగిందని గూగుల్ రిపోర్ట్ స్పష్టం చేసింది. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి.. భారతీయులు దీని గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో చాలానే వెతికారు. దీంతో గూగుల్‌లో దీని సెర్చ్ 150శాతం పెరిగింది.

దగ్గరలోని కిరాణ దుకాణం కోసం...

దగ్గరలోని కిరాణ దుకాణం కోసం...

లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో చాలావరకు చెల్లింపులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం గూగుల్‌లో వెతికారు. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్ బిల్లు ఎలా చెల్లించాలి లేదా ఇతరత్రా బిల్లులు ఎలా చెల్లించాలి వంటి ప్రశ్నల సెర్చ్ గూగుల్‌లో 180శాతం పెరిగింది.
అలాగే తమ ఇంటి సమీపంలోని కిరాణ దుకాణాల కోసం ఎక్కువమంది వెతకడంతో గూగుల్‌లో దాని సెర్చ్ 550శాతం పెరిగింది. అలాగే దగ్గరలోని రేషన్ షాప్ సెర్చ్ 300శాతం,మెడికల్ షాప్ సెర్చ్ 58శాతం పెరిగింది.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌‌ సెర్చ్ కూడా..

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌‌ సెర్చ్ కూడా..


అలాగే 'జిమ్ ఎట్ హోమ్' వివరాల కోసం గూగుల్‌లో 93శాతం సెర్చ్ పెరిగింది. ఆన్‌లైన్ లెర్నింగ్ సెర్చ్ 85శాతం పెరగ్గా.. టీచ్ ఆన్‌లైన్ సెర్చ్ 148శాతం పెరిగింది. అలాగే లెర్నింగ్ ఎట్ హోమ్ 78శాతం పెరిగింది. అలాగే లాక్ డౌన్‌లో నగదు రహిత చెల్లింపులు,మొబైల్ పేమెంట్స్ కూడా పెరగడంతో.. QR కోడ్స్ సంబంధిత సెర్చ్ 66శాతం పెరిగింది. యూపీఐ పిన్ చేంజ్‌కి సంబంధించిన సెర్చ్ 200శాతం పెరిగింది. మొత్తంగా 2020లో వీడియో స్ట్రీమింగ్ సెర్చ్ రేటు 40 శాతం నుంచి 120శాతానికి పెరిగింది.

English summary
As the country witnesses lockdown and Indians search for favourite street food and other recipes to satisfy their cravings, Google India saw 107 per cent increase in searches for 'panipuri' recipe and ayurvedic home remedies like 'kadha' (medicinal decoction) saw more than 90 per cent rise after Prime Minister Narendra Modi urged people to drink it to boost the immune system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X