వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2020 : What is Populist Budget || Is It For Common Man ? || Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపుపై మధ్యతరగతి జీవులు ఆశగా చూస్తున్నారు. తమ చేతికి అందే జీతం కొంత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదిఇలావుంటే, స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు గత సెప్టెంబర్ నాటికి 4.5శాతానికి తగ్గడంతో బడ్జెట్ కేటాయింపులు ఆసక్తిగా మారింది.

పాపులిస్ట్ బడ్జెటేనా.?

పాపులిస్ట్ బడ్జెటేనా.?

ఆర్థిక మందగమనంను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ పన్నులను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపుపన్ను పరిమితిని పెంచితే ఉద్యోగులు కూడా తమ చేతికి అందే జీతం మొత్తం కాస్తా పెరుగుతుందని ఆశగా చూస్తున్నారు. అయితే, ప్రభుత్వ ప్రజాదరణ బడ్జెట్(పాపులిస్ట్ బడ్జెట్) ఇస్తుందా? లేక ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉంటుందా? అనేది చూడాలి. పన్ను తగ్గించడమే కాకుండా ఆర్థిక మంత్రి పరిష్కరించదగిన మరిన్నిదారులు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

పాపులిస్ట్ బడ్జెట్ అంటే..

పాపులిస్ట్ బడ్జెట్ అంటే..

అయితే, ఈ పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటంటే.. ఖచ్చితమైన నిర్వచనమేమీ లేదు. దేశంలోని ఎక్కువమంది ప్రజల ఆసక్తులను, అవసరాలను దృష్టిలో పెట్టుకునే రూపొందించే బడ్జెట్ అని చెప్పవచ్చు. సాధారణ ప్రజలను, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించడం జరుగుతుంది. అయితే, ఇదే వేరే ప్రత్యేకమైన బడ్జెట్ ఏం కాదు. జోడించిన ఒక ప్రక్రియ మాత్రమే. దేశంలోని మెజార్టీ ప్రజలు అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందితే దాన్నే పాపులిస్ట్ బడ్జెట్ అనవచ్చు.

రాజకీయ పార్టీలే ఎక్కువగా..

రాజకీయ పార్టీలే ఎక్కువగా..

ఎక్కువగా ఈ పదాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తాయి. బడ్జెట్ కేటాయింపుల పట్ల తమ నిరసనను వ్యక్తం చేసేందుకు, అధికారపార్టీని నిందించే సమయంలో ఎక్కువగా ప్రజాదరణ లేని బడ్జెట్ అంటూ విమర్శిస్తారు. పన్నుల సేకరణ మొత్తాలను పెంచుకునే కంటే పన్ను సంస్కరణలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

జీవన ప్రమాణాలు పెంచే విధంగా..

జీవన ప్రమాణాలు పెంచే విధంగా..

2018 బడ్జెట్ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 40వేలు ఉండగా.. ఆ మొత్తంపై 2019 బడ్జెట్‌లో రూ. 10లు పెంచడం జరిగింది. ట్రాన్‌స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ లాంటి అంశాలు తీసేసి ట్రావెల్ అలవెన్స్, చిల్డ్రెన్ ఎడ్యుకేషన్ అలవెన్స్‌లు కొనసాగించడం జరిగింది. కాగా, కేవలం ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకుక చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

English summary
Just one month ahead of the Union Budget for the FY 2018-19 to be presented on February 1, 18, there have been news making rounds of the most likely Populist budget announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X