వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2020: ద్రవ్య లోటు అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ద్రవ్య లోటు(ఫిస్కల్ డెఫిసిట్)అంటూ వస్తున్న వార్తలు మనం తరచూ వింటూ.. చూస్తూ ఉంటాం. అయితే, అసలు ద్రవ్యలోటు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వచ్చే నెల బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ద్రవ్యలోటు గురించి తెలుసుకోల్సిన అవసరం ఉంది.

ప్రజాస్వామ దేశమైన భారత్ లాంటి దేశాల్లో ద్రవ్య లోటు అనే అంశం ఎప్పుడూ చర్చలో ఉంటుంది. అందుకే చాలా మందికి దీనిపై ఆసక్తి. దేశ ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయాలు మన రోజువారీ జీవితాలపై ప్రభావం చూపుతాయి. దీనిపై ఏమీ తెలియనివారిలా ఉండకుంటే మంచిది.

union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి? union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి?

ద్రవ్యలోటుపై ఉండే సాధారణ సందేహాలు, వివరణ:

ద్రవ్యలోటు అంటే ఏమిటి?

ద్రవ్యలోటు అంటే ఏమిటి?

లోటు అంటే మిగులుకు వ్యతిరేక పదమనేది తెలిసిన విషయమే. లోటు అంటే ఏదైనా తక్కువగా ఉందని అర్థం వస్తుంది. ద్రవ్యలోటు అంటే ద్రవ్యం తక్కువగా ఉండటం. ప్రభుత్వంకు వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులుంటే అప్పుడు ద్రవ్యలోటు ఏర్పడుతుంది. ప్రభుత్వానికి ప్రధానంగా పన్నులు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం చేసిన అప్పు ఇందులోకి రాదు.

ద్రవ్యలోటు ఏర్పడటానికి గల సాధారణ కారణాలు?

ద్రవ్యలోటు ఏర్పడటానికి గల సాధారణ కారణాలు?


అంచనా వేసినదానికంటే ఆదాయం తక్కువగా రావడం. దీర్గకాలిక ప్రయోజనాల కోసం మౌలిక సదుపాయాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేసిన సందర్భాల్లో ద్రవ్యలోటు ఏర్పాటు అవకాశం ఉంటుంది.

ద్రవ్యలోటును ఎలా భర్తీ చేయాలి?

ద్రవ్యలోటును ఎలా భర్తీ చేయాలి?

ద్రవ్యలోటు ఏర్పడిన సమయంలో దేశం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) అనుంచి అప్పు తీసుకోవచ్చు. ట్రెజరీ బాండ్స్, బిల్లులను క్యాపిటల్ మార్కెట్లలో ఇష్యూ చేయడం ద్వారా డబ్బును పెంచుకునే అవకాశం ఉంటుంది.
లోటు ఖర్చు అంటే?: ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా చేయడంతో ఏర్పడుతుంది.

ద్రవ్యలోటు చుట్టూనే ఆర్థిక సిద్ధాంతాలు

ద్రవ్యలోటు చుట్టూనే ఆర్థిక సిద్ధాంతాలు

ద్రవ్యలోటు పలు సందర్భాల్లో మాంద్యాన్ని తగ్గించేందుకు.. పూర్తిగా లేకుండా చేసేందుకు సానుకూల ఫలితాలను ఇస్తుందని ఆర్థికశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. నిరుద్యోగిత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం చేసే ఖర్చులు వ్యాపారాలకు మార్కెట్ చేసి ఆదాయాన్ని, వినియోగదారుల కొనుగోలును పెంచడం ద్వారా వ్యాపారరంగంలో ప్రగతి సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. బిజినెస్ ఔట్‌పుట్ పెరిగితే స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)ని కూడా పెంచుతుంది.

 ద్రవ్యలోటు పాలసీ..

ద్రవ్యలోటు పాలసీ..

మార్కెట్ పరిమాణం పెరిగిన కొద్దీ.. ఆర్థిక వృద్ధిరేటు పురోగమనం సాధిస్తుంది. ద్రవ్యలోటు లేదా ద్రవ్యో మిగులును ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందే తెలిపే ప్రక్రయను ద్రవ్య పాలసీ(ఫిస్కల్ పాలసీ) అంటారు. కేంద్ర ఆర్థిశాక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ద్రవ్యలోటు అంశం కీలకం కానుంది.

English summary
You would have heard the term 'fiscal deficit' over the news repeatedly now that the date for the budget announcement is drawing closer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X