వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు ప్రొటెం స్పీకర్ అంటే ఎవరు?: ఆ నియామకానికి అనుసరించే పద్దతులేమిటి?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా కేజీ బోపయ్యను అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో.. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేజీ బోపయ్య నియామకం సరైందేనా? కాదా? అన్నది పక్కనపెడితే.. అసలు ప్రొటెం స్పీకర్ పాత్ర ఏమిటి?, ఆయన నియామకంలో అనుసరించే పద్దతులేమిటి అన్న దానిపై చాలామంది ఆరా తీస్తున్నారు.

Bopaiah

ప్రొటెం స్పీకర్ నియామకం:

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ పద్దతిలోనే శాసనసభ ప్రొటెం స్పీకరును నియమిస్తారు. సాధారణంగా సీనియర్ సభ్యుడినే ఎందుకు ఎంపిక చేస్తారు. అయితే అందరికన్నా సీనియర్ అయిన సభ్యుడినే ఎంపిక చేయాలన్న నిబంధనేమి లేదు. ప్రొటెం స్పీకర్ కోసం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మొదట కొందరు సీనియర్‌ సభ్యుల జాబితా రూపొందిస్తోంది. ఆ తర్వాత గవర్నర్ ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారు. లోక్ సభలో అయితే ఈ బాధ్యత రాష్ట్రపతి తీసుకుంటారు.

ప్రొటెం స్పీకర్ విధులు:

సాధారణంగా అయితే ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం వీరి ప్రధాన విధి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం, లేదా మరణించడం జరిగిన సందర్భాల్లోనూ ప్రొటెం స్పీకరును నియమిస్తారు. స్పీకరును ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు.. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నది లేనిది తేల్చే బలపరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు.

English summary
A pro-tem speaker is chosen with the agreement of the members of the Lok Sabha and legislative assembly, so that he can carry on the activities till the permanent speaker is not chosen. Once the new Speaker is elected, the office of the pro tem speaker ceases to exist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X