వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మావత్ అల్లర్లు: అసలేమిటీ శ్రీ రాజపూత్ కర్ణిసేన?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా అల్లర్లకు, విధ్వంసానికి దిగడంతో శ్రీ రాజపూత్ కర్ణిసేన పేరు దేశప్రజలందరికీ తెలిసి వచ్చింది. అసలు ఈ సంస్థ స్వరూప స్వభావాలేమిటి, దానికి పుట్టుపూర్వోత్తరాలేమిటనే ప్రశ్నలు అందరి మెదళ్లలో పుడుతున్నాయి.

Recommended Video

Padmaavat protest : పద్మావత్: హింసాత్మక ఆందోళన, వీడియో

శ్రీ రాజపుత్ కర్ణిసేన నాయకుడు 67 ఏళ్ల లోకేంద్ర సింగ్ కల్వీ పద్మావత్ సినిమాపై సమరం ప్రకటించారు. పద్మావత్ సినిమా గురించి ఆయన అన్న మాటలివి- "నేను నిన్న గాంధీ పుట్టిన చోటికి వెళ్లాను. బాపూ, నాకు బలాన్ని ఇవ్వు అని ప్రార్థించాను. దేశం నుంచి నువ్వు బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టావు. నేను కేవలం పద్మావత్ సినిమాను తొలగించాలని అనుకుంటున్నా".

 అది రాజపూత్ కుల సంస్థ

అది రాజపూత్ కుల సంస్థ

భారతదేశంలో శ్రీ రాజపూత్ కర్ణిసేన అనేది ఓ కుల సంఘం. పద్మావత్ సినిమాపై కన్నా ముందు పలు హింసాత్మక ఆందోళనలను అది నడిపింది. శ్రీ రాజపూత్ కర్ణిసేనకు 2005లో పునాదులు పడ్డాి. రాజస్థాన్ రాజపూత్ సామాజిక వర్గానికి చెందన నిరుద్యోగ యువత దాన్ని ఏర్పాటు చేరింది.

 కల్వీ అండదండలతో ముందుకు..

కల్వీ అండదండలతో ముందుకు..

అప్పటికే రాజపూత్ నాయకుడిగా ఆ సామాజికవర్గంలో గుర్తింపు ఉన్న లోకేంద్ర సింగ్ కల్వీ అండదండలతో అది ప్రాణం పోసుకుంది. కులాల ప్రాతిపదికన తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.

 ఆ తర్వాత వైఖరి మారింది...

ఆ తర్వాత వైఖరి మారింది...

రాజపూత్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కులాల ప్రాతిపదికపై రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే, కర్ణిసేన ఆవిర్భావం తర్వాత వారి వైఖరి మారింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని వారు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికి కూడా వారి వైఖరి అదే.

 కర్ణిసేన విడిపోయింది...

కర్ణిసేన విడిపోయింది...

అయితే, రాజకీయ నాయకులు సమీకరణాల కారణంగా శ్రీ రాజపూత్ కర్ణిసేన మూడు గ్రూపులుగా విడిపోయింది. ఒకటి శ్రీ రాజపూత్ కర్ణిసేన కాగా, రెండోది రాష్ట్రీయ రాజపూత్ కర్ణిసేన మితి, మూడోది శ్రీ రాష్ట్రీయ రాజపూత్ కర్ణిసేన. ప్రస్తుతానికి శ్రీ రాజపూత్ కర్ణిసేననే పెద్ద గ్రూప్.

 జోథా అక్బర్‌పై కూడా ఆందోళన...

జోథా అక్బర్‌పై కూడా ఆందోళన...

అశుతోష్ గోవరికర్ తసన జోథా అక్బర్ బాలీవుడ్ సినిమాను అడ్డుకోవడం ద్వారా 2006లో మొదటిసారి దేశవ్యాప్తంగా కర్ణిసేన పేరు వినిపించింది. ఇప్పుడు పద్మావత్ సినిమాపై సమరం ప్రకటించడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.

English summary
The origin of the Karni Sena can be traced to attempts by the Rajput leader Lokendra Singh Kalvi to mobilise the Rajput community in 2005.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X