వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాధ్యాయ దినోత్సవం: విశిష్టత ఏమిటి, సర్వేపల్లి గురించి కొన్ని అంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యం, విశిష్టత ఏమిటి...!

న్యూఢిల్లీ: నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున అంటే సెప్టెంబర్ 5వ తేదీన మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్ర, మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవ సత్కారాలు ఉంటాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటారు.

గురులో 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది.. అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించేవాడు లేదా చీకటిని తొలగించేవాడు గురు లేదా గురువు అని అర్థం. భారతరత్న, తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888లో తిరుత్తనిలో జన్మించారు. 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది.

పలుమార్లు నోబెల్ బహుమతికి నామినేట్

పలుమార్లు నోబెల్ బహుమతికి నామినేట్

సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

గురువులకు ప్రతీక వీరు

గురువులకు ప్రతీక వీరు

సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి. ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు. గురువుకు ఉండాల్సిన లక్షణాలను మన పురాణాల్లోను వివరించారు. గురుశిష్యుల సంబంధాలకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు - అర్జునుడు, చాణక్యుడు - చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాసు - ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస - వివేకానంద స్వామిలు గురుశిష్యుల సంబంధానికి ప్రతీక.

రాధాకృష్ణన్ గురించి కొన్ని విషయాలు

రాధాకృష్ణన్ గురించి కొన్ని విషయాలు

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. 1962 నుంచి 1967 వరకు రెండో రాష్ట్రపతి. అతను గొప్ప ఫిలాసపర్, విద్యావేత్త, మానవతావాది. రాధాకృష్ణన్ తన 16వ ఏట శివకామును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు పేరు సర్వేపల్లి గోపాల్. లండన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగం విన్న అనంతరం హెచ్ఎన్ స్పాల్డింగ్ 1936లో ఆక్స్‌ఫర్డ్ ఫర్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్‌లో స్థానం కల్పించారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్

1953 నుంచి 1952 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్‌గా పని చేశారు. ఘనశ్యామ్ దాస్ బిర్లా తదితరులతో కలిసి రాధాకృష్ణన్ కృష్ణార్పన్ చారిటీ ట్రస్ట్‌ను స్థాపించారు. నోబెల్ బహుమతికి 27సార్లు నామినేట్ అయ్యారు. రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్స్, రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డులు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జ్ఢాపకార్థం ఏర్పాటు చేశారు.

English summary
Dr Sarvepalli Radhakrishnan, the first Vice President of India (1952–1962) and the second President of India from 1962 to 1967, referred as great philosopher, a great educationist and a great humanist by Pandit Jawaharlal Nehru is honoured for his contribution every year on his birthday on September 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X