వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపర్ణ వ్యూహమేమిటి,రీటాను ఆమెనుఢీకొట్టేనా, అఖిలేష్ చెక్ పెట్టేనా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుండి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు బరిలోకి దిగుతున్నారు.అయితే ఈ స్థానం నుండి ఇప్పటివరకు సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించలేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుండి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు బరిలోకి దిగుతున్నారు.అయితే ఈ స్థానం నుండి ఇప్పటివరకు సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించలేదు.

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారిగా అపర్ణ ప్రవేశిస్తున్నారు. లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె బరిలోకి దిగుతున్నారు.
ములాయం సింగ్ రాజకీయవారసురాలిగా అపర్ణ యాదవ్ ను చూడాలని ఆమె అత్త కోరుకొంటున్నారు.అయితే పార్టీలో సంక్షోభానికి కూడ పరోక్షంగా అత్త సాదనా, అపర్ణ లు కారణమనే అఖిలేష్ వర్గీయులు ఆరోపణలు చేశారు.

అయితే సమాజ్ వాదీ పార్టీని తన చేతుల్లోకి తీసుకొన్న అఖిలేష్ అపర్ణతో పాట్ ఆమె ములాయం కు కూడ చెక్ పెట్టారు.దీంతో అఖిలేష్ చెప్పినట్టుగానే నడుచుకొనే పరిస్థితికి అపర్ణ వచ్చారు.

లక్నో కంటోన్మెంట్ నుండి బరిలోకి అపర్ణ

లక్నో కంటోన్మెంట్ నుండి బరిలోకి అపర్ణ

లక్నో కంటోన్మెంట్ నుండి బరిలోకి అపర్ణ
లక్నో కంటోన్మెంట్ నుండి బరిలోకి అపర్ణ

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి ఇంతవరకు సమాజ్ వాదీ పార్టీ విజయం సాదించలేదు.అయితే గత ఏడాది కాలంగా ఈ స్థానం నుండి స్వచ్చంధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అపర్ణ. ఈ స్థానం నుండి ఆమె పోటీ చేసేందుకుగాను ఏడాది కాలంగా ఆమె ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శివపాల్ యాదవ్ అపర్ణ పోటీచేస్తారని ప్రకటించారు.ఆనాటి నుండి ఆమె ఈ స్థానంలోనే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 రాజకీయ ఉద్దండురాలిని ఢీకొట్టనున్న అపర్ణ

రాజకీయ ఉద్దండురాలిని ఢీకొట్టనున్న అపర్ణ

రీట బహుగుణ జోషితో అపర్ణ యాదవ్ బరిలోకి దిగుతోంది.రీట బహుగుణ ఇటీవలే కాంగ్రెస్ నుండి రీట బహుగుణ జోషి బిజెపిలో చేరారు. లక్నో కంటోన్మెంట్ నుండి రీట బహుగుణ జోషి బరిలోకి దిగుతున్నారు.అయితే ఆమెపై అపర్ణ పోటీచేస్తున్నారు. అపర్ణ రాజకీయాల్లోకి రావడం కొత్త. అపర్ణ ములాయం సింగ్ చిన్న కోడలుగా గుర్తింపు పొందింది.

లక్నో కంటోన్మెంట్ స్థానాన్నే ఎంచుకొన్న అపర్ణ

లక్నో కంటోన్మెంట్ స్థానాన్నే ఎంచుకొన్న అపర్ణ

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని అపర్ణ ఎంచుకొన్నారు.అపర్ణ ఈ స్థానంలోనే పోటీచేస్తానని పట్టుబట్టారు.ఈ నేపథ్యంలోనే వేరే స్థానం కోరుకోవాలని పార్టీ నాయకత్వం కోరినా ఆమె మాత్రం ససేమిరా అన్నారు. ఏడాదికి పైగా ఆమె ఈ స్థానం నుండి కేంద్రీకరించి పనిచేస్తున్నారు.దీంతో ఇదే స్థానం నుండి పోటీచేస్తానని ఆమె పట్టుబట్టారు.దీంతో అఖిలేష్ అపర్ణకు లక్నో కంటోన్మెంట్ టిక్కెట్టు దక్కింది.

రాజకీయాల్లో రాణిస్తారా?

రాజకీయాల్లో రాణిస్తారా?

లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి అపర్ణ బరిలోకి దిగుతున్నారు.అయితే రాజకీయాల్లో ఆమె రాణిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ములాయం సింగ్ రెండో కుమారుడు ప్రతీక్ సతీమణే అపర్ణ. ములాయంకు రాజకీయవారసురాలిగా అపర్ణను చూడాలని ఆమె భావిస్తున్నారు. దీంతో అపర్ణ రాజకీయాల్లోకి వచ్చారు. మరో వైపు అఖిలేష్ తరహలో ఆమె రాజకీయాల్లో రాణిస్తారా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అపర్ణ వ్యూహమేమిటి

అపర్ణ వ్యూహమేమిటి

రాజకీయాల్లో ఆరితేరిన రీట బహుగుణపై పోటీచేయడమంటే సామాన్యం కాదు.అయితే ఆమెను ఓడించాలంటే అనేక ఎత్తులు వేయాల్సి ఉంది. ఏడాది నుండి ఈ అసెంబ్లీ నియోజకవర్గం లో చేసిన కార్యక్రమాలు కలిసి వస్తాయని ఆమె భావించవచ్చు. కాని, ఈ కార్యక్రమాల వల్లే గెలుపు సాధ్యం కాకపోవచ్చు.అయితే అపర్ణ గెలుపుకు అఖిలేష్ వర్గం సహకారం కూడ అనివార్యం. అయితే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అపర్ణ వ్యూహంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
what is the aparna stragy in Uttarpradesh elections. aparna contesting from lucknow contonment assembly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X