వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గాన్ పాలకుడికి పరమశివుడికి కనెక్షన్ ఏంటి..? శివరాత్రి నాడు జమ్మూకశ్మీర్ ప్రత్యేకతేంటి..?

|
Google Oneindia TeluguNews

జమ్మూకశ్మీర్ : మహాశివరాత్రి అంటే భారతీయులకు ఒక పెద్ద పండగా. తాము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పరమశివుడు పార్వతుల పెళ్లి రోజు. ఈ రోజున శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. అదే సమయంలో శివన్నామ స్మరణతో ఆలయాలు మారుమోగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా మహాశివరాత్రి వేడుకను జరుపుకుంటారు. ఇక ఎప్పుడూ తుపాకుల మోత వినిపించే జమ్మూ కశ్మీర్‌లో మహాశివరాత్రి వేడుక ప్రత్యేకం అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్ పాలకుడికి ఈ మహావేడుకకు ఒక చిన్న కనెక్షన్ ఉంది.. అదేంటో మీరే చదవండి.

ఇతర పండుగలతో పోలిస్తే శివరాత్రి చాలా స్పెషల్

ఇతర పండుగలతో పోలిస్తే శివరాత్రి చాలా స్పెషల్

మహాశివరాత్రి పండగ ఫిబ్రవరి 20-21వ తేదీ అర్థరాత్రి వస్తుంది. మహాశివరాత్రినే జమ్మూ కశ్మీర్ స్థానికులు హెరాత్ అని పిలుస్తారు. శివపార్వతులు ఒక్కటైన రోజు. అంటే వారిద్దరూ వివాహం చేసుకున్న రోజు శివరాత్రి. మంచు తీవ్రమైన చలి ఉన్న సమయంలో జమ్మూ కశ్మీర్‌లో శివరాత్రి వేడుక వస్తుంది. శివరాత్రి రోజున వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ చెప్పింది. ముందుగా మహాశివరాత్రి వేడుక సందర్భంగా ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు వాతావరణ శాఖ డైరెక్టర్ సోనమ్ లోటస్. వాతావరణ కోణంలో చూస్తే ఈ మహాశివరాత్రి వేడుక ఎంతో ప్రత్యేకం. ఇతర పండుగలతో పోలిస్తే జమ్మూ కశ్మీర్‌లో మహాశివరాత్రి వేడుక చాలా స్పెషల్‌ అని లోటస్ వివరించారు.

 కచ్చితంగా మంచు, ఆపై వర్షం కురుస్తుంది

కచ్చితంగా మంచు, ఆపై వర్షం కురుస్తుంది

ఇక ఏటా మహాశివరాత్రి రోజున జమ్మూకశ్మీర్‌లో ఓమాదిరి వర్షాలతో పాటు మంచు కూడా కురుస్తుందని లోటస్ వివరించారు.ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షంతో పాటు మంచు కూడా కురుస్తుందని చెప్పారు. ఎక్కువగా కార్గిల్ జిల్లా, లడాఖ్‌లో రానున్న 24 గంటల నుంచి 36 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.వర్షాలతో బనిహాల్ - రంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. రవాణా వ్యవస్థ నిలిచి పోయే అవకాశం కూడా ఉందన్నారు.

శివారత్రి మరుసటి రోజు పూజలు..దీన్నే సలామ్ అని పిలుస్తారు

శివారత్రి మరుసటి రోజు పూజలు..దీన్నే సలామ్ అని పిలుస్తారు

స్థానికులు హెరాత్ అని పిలుచుకునే ఈ మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలో 13వ రోజు లేదా 14వ రోజున వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శివరాత్రి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో పడుతుంది. ఇక మహాశివరాత్రి వేడుకను కశ్మీర్‌లో నివసించే హిందువులు బాగా జరుపుకుంటారు. కశ్మీరీలో దీన్ని హెరాత్ అని పిలుస్తారు. హరారాత్రి అనే సంస్కృత పదం నుంచి హెరాత్ అనే పదం వచ్చింది. మహాశివరాత్రి రోజు తర్వాత మరుసటి రోజు శివుడికి పూజలు నిర్వహిస్తారు. దీన్నే సలామ్ అని పిలుస్తారు.

అఫ్ఘాన్ పాలకుడికి శివరాత్రికి కనెక్షన్

అఫ్ఘాన్ పాలకుడికి శివరాత్రికి కనెక్షన్

మహాశివరాత్రికి అఫ్ఘాన్ పాలకుడికి సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. జమ్మూ కశ్మీర్‌లో మహాశివరాత్రి రోజున కురిసే మంచుకు 18వ శతాబ్దంలో అఫ్ఘానిస్తాన్ గవర్నర్ జబ్బర్ ఖాన్‌కు ఓ చిన్న కనెక్షన్ ఉంది. 18వ శతాబ్ధంలో కశ్మీర్‌ను పాలించిన చివరి అఫ్ఘానిస్తాన్ గవర్నర్ జబ్బర్ ఖాన్‌ను ఏటా శివరాత్రి రోజున ఎగతాళి లేదా హేళన చేస్తారు స్థానికులు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. శివరాత్రి తర్వాత రోజున జరిగే పూజా వేడుక సలాం అనేది కశ్మీర్ పండిట్స్ సంప్రదాయంలో భాగమైంది. ఇందుకు కారణం చివరి అఫ్ఘానిస్తాన్ గవర్నర్ జబ్బర్ ఖాన్ మహాశివరాత్రిని జూలైలో జరుపుకోవాల్సిందిగా బలవంతం చేసేవాడని చరిత్ర చెబుతోంది.

జూలైలో వేడుక జరుపుకోవాల్సిందిగా బలవంతం చేసిన జబ్బార్ ఖాన్

జూలైలో వేడుక జరుపుకోవాల్సిందిగా బలవంతం చేసిన జబ్బార్ ఖాన్

సాధారణంగా మహాశివరాత్రి వేడుక రోజున మంచు విపరీతంగా కురుస్తుంది. అయితే మహాశివరాత్రికి మంచుకు సంబంధం ఏంటనేది తెలుసుకోవాలనుకున్నాడు జబ్బర్ ఖాన్. మహాశివరాత్రిని జూలైలో అంటే వేసవి కాలంలో జరుపుకుంటే ఆ సమయంలో మంచుకురవడం తాను చూడాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడని చరిత్ర చెబుతోంది. ఇక జబ్బర్ ఖాన్ ఆదేశాలతో శివరాత్రిని కశ్మీరీలు జూలై నెలలో జరుపుకున్నారు. పూజావేడుక అయిన సలామ్‌ను చేసే సమయంలో అనూహ్యంగా మంచు కురిసింది. దీంతో జబ్బార్ ఖాన్ ముఖం చిన్నబోయిందని చరిత్ర చెబుతోంది. ఇలా శివరాత్రి వేడుకకు అప్ఘానిస్తాన్ పాలకుడికి ఒక కనెక్షన్ కుదిరింది. అందుకే జబ్బర్ ఖాన్‌ను ఈ వేడుక రోజున ప్రజలు తిట్టుకుంటారు లేదా శాపనార్థాలు పెడతారు.

English summary
According to history, the word 'salaam' got incorporated in Kashmiri Pandits' tradition when Jabbar Khan forced them to celebrate Maha Shivaratri in July to see whether it would snow if the festival is celebrated in the summer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X