వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: అయోధ్య కేసుతో ఢిల్లీలోని ఓవైసీ బంగ్లాకు సంబంధం ఏమిటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీమసీదు భూవివాదం కోర్టులో గత కొన్ని దశాబ్దాలుగా నానుతోంది. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మిస్తామని ఒక హిందుసంఘాలు చెబుతుండగా దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేసు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. అయితే అయోధ్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. అయోధ్య కేసుకు ఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నివాసంకు సంబంధం ఉంది అనే అంశం వెలుగులోకి వచ్చింది. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 1993 నుంచి ఆ ఇంట్లోనే..

1993 నుంచి ఆ ఇంట్లోనే..

1993 నుంచి అయోధ్య వివాదం ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది. బాబ్రీ మసీదు కూల్చిన నాటి నుంచి అక్టోబర్ 16 చివరి వాదనల వరకు అయోధ్యకు ఢిల్లీకి ఎక్కడో కనెక్ట్ అయ్యింది. ఈ కేసులో ముస్లిం పార్టీల తరపున పోరాడుతున్న వారికి ఢిల్లీలోని 34 అశోకా మార్గ్‌లోని మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ ఓవైసీ నివాసం వేదికగా నిలిచింది. అంటే ఓవైసీ నివాసంలో ముస్లిం మతపెద్దలు ఉండి కేసుకు సంబంధించిన అప్‌డేట్స్ తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు, వ్యూహాలు అమలు చేసింది ఈ హైదరాబాద్ ఎంపీ ఇంట్లోనే. అయితే బాబ్రీ మసీదు కూల్చివేతపై ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న జాఫర్యాబ్ జిలానీకి తన ఇంట్లో ఆతిథ్యం కల్పించాల్సిన అవసరం ఓవైసీకి లేదు. అంతేకాదు అతనిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ మతపరమైన కంపల్షన్స్‌ కానీ లేవు. కానీ ఎందుకు ఆతిథ్యం ఇచ్చారు..?

 బాబ్రీ మసీదు కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా జిలానీ

బాబ్రీ మసీదు కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా జిలానీ

అయోధ్య కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న జాఫర్యాబ్ జిలానీకి తన ఇంట్లో ఆతిథ్యం కల్పించాల్సిన అవసరం ఓవైసీకి లేనప్పటికీ ఆయనకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించడం వెనక ఓ ప్రధాన కారణం ఉంది. ఓవైసీ తండ్రి సలాహుద్దీన్ ఓవైసీ తాను బతికిఉండగా జిలానీకి అన్ని విధాలా సహకారం అందిస్తానని చెప్పినట్లు జిలానీ చెప్పారు. బాబ్రీమసీదు కేసులో ఢిల్లీకి రావాల్సి వస్తే ఓవైసీ వంశం తనకు అన్ని మర్యాదలు చేస్తుందని చెప్పారట. తన తండ్రి ఇచ్చిన మాటను ఓవైసీ గత కొన్నేళ్లుగా నిలుపుకుంటున్నారు. అయితే దీనికంటే ఎక్కువగా ఓవైసీ కూడా ఏమీ చేయలేదు.

 నా తండ్రికి జిలానీ మంచి మిత్రుడు: ఓవైసీ

నా తండ్రికి జిలానీ మంచి మిత్రుడు: ఓవైసీ

తన తండ్రికి జిలానీ మంచి మిత్రుడని అతనిని తాను ఒక అతిథిగానే చూస్తానని అసాదుద్దీన్ ఓవైసీ చెప్పారు.అతిథి గురించి ఎక్కువగా మాట్లాడటం హైదరాబాదీల సంస్కృతి కాదని ఓవైసీ అన్నారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే తన పితరులను వ్యతిరేకించినట్లే అవుతుందని చెప్పారు. గురువారం వరకు సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున అప్పటివరకు ఓవైసీ బంగ్లా జిలానీ అతని అనుచరులకు ఆశ్రయం ఇస్తోంది.

 ఓవైసీ తండ్రి సలాహుద్దీన్ ఆతిథ్యం ఇచ్చారు

ఓవైసీ తండ్రి సలాహుద్దీన్ ఆతిథ్యం ఇచ్చారు

జాఫర్యాబ్ జిలానీ ఆలిండియా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఇక అశోక్‌రోడ్‌లోని ప్రస్తుతం ఉన్న అసదుద్దీన్ బంగ్లా 1984 నుంచి ఓవైసీలతోనే ఉంది. 1993 నుంచి తాము ఇక్కడ ఉంటున్నట్లు జిలానీ చెప్పారు. బాబ్రీ మసీదు కేసు విషషమై లక్నో నుంచి ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లో ఉండొచ్చని ఓవైసీ తండ్రి సలాహుద్దీన్ ఓవైసీ చెప్పారని జిలానీ గుర్తుచేశారు. తనతో పాటు తన అనుచరులకు కూడా ఉండేందుకు గది, భోజన వసతులు ఏర్పాటు చేస్తారని జిలాని చెప్పారు. ఒక గది ప్రత్యేకంగా తమ కోసమే ఏర్పాటు చేశారని జిలానీ చెప్పారు. ఇక పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చినప్పుడు హాల్ గదిలో వసతులు ఏర్పాటు చేస్తారని జిలానీ చెప్పారు.

 ఇక్కడే కేసుపై వ్యూహాలు రచిస్తాం

ఇక్కడే కేసుపై వ్యూహాలు రచిస్తాం

ఇక ఎప్పుడైనా పార్లమెంటు సమావేశాలు, అయోధ్య కేసు ఒకేసారి వస్తే అసదుద్దీన్ ఓవైసీతో పాటు అంతా కలిసే ఉంటామని జిలానీ చెప్పారు. అదరం కలిసే భోజనం చేస్తామని గుర్తుచేసుకున్నారు. డ్రాయింగ్ గదిలో కూర్చుని అంతా ఎవరిపని వారు చేసుకుపోతారని జిలానీ చెప్పారు. స్వతహాగా అడ్వకేట్ అయిన ఓవైసీ కేసుకు సంబంధించిన అప్‌డేట్స్ అడిగి తెలుసుకుంటారని జిలానీ చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో ఎలా వాదనలు వినిపించాలని అంతా కలిసే చర్చిస్తామని వెల్లడించారు.

English summary
hyderabad MP Asaddudin Owaisi's Bungalow in Delhi's Ashok Marg has been a shelter home for those making their arguments in Babri Masjid Ayodhya case, specially for Zafaryab Jilani and his associates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X