• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది..? ట్రిపుల్ తలాక్ చరిత్ర ఏమిటి..?

|

మోడీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల మధ్య ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు ఉభయ సభల్లో పాస్ కావడంతో ఇక రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపుతారు. ఒక్కసారి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత అది చట్టరూపం దాలుస్తుంది. అయితే ట్రిపుల్ తలాక్ ఏంటి.. ఈ బిల్లు చరిత్ర ఏమిటి..? అసలు ప్రభుత్వం బిల్లును ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది..?

రాజ్యసభ ఆమోదం పోందిన ట్రిపుల్ తలాక్ బిల్లు.. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84

 పంతం నెగ్గించుకున్న మోడీ సర్కార్

పంతం నెగ్గించుకున్న మోడీ సర్కార్

చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే ఇది చట్టరూపం దాలుస్తుంది. ఇక ఒక్కసారిగా ట్రిపుల్ తలాక్ బిల్లు చట్ట రూపం దాలిస్తే ముస్లిం మహిళలకు తలాక్ అని మూడు సార్లు చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. అయితే ట్రిపుల్ తలాక్ చరిత్ర ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఫిబ్రవరి 21 వరకు ఆర్డినెన్స్ రూపంలో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లు తాజాగా ఉభయసభలు ఆమోదం తెలపడంతో ఇక చట్టరూపం దాల్చనుంది. 2017లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వారి భార్యలకు విడాకులు ఇవ్వాలంటే మూడుసార్ల తలాక్ చెప్పి వారికి విడాకులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలా చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై చట్టం తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ట్రిపుల్ తలాక్ బిల్లు చరిత్ర

ట్రిపుల్ తలాక్ బిల్లు చరిత్ర

సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తూ మోడీ సర్కార్ తొలి ప్రభుత్వంలో 2017 డిసెంబర్‌లో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లు పాస్ అయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలని నాడు ప్రధాని మోడీ అభ్యర్థించారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్,మజ్లిస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు రాజ్యసభలో వ్యతిరేకించాయి. ఆ సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సభలో మెజార్టీ లేకపోవడంతో రాజ్యసభలో ఫెయిల్ అయ్యింది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పురుషులను హింసించేందుకే ప్రభుత్వం ఈ బిల్లును ఒక ఆయుధంగా వినియోగించుకోవాలని చూస్తోందని విపక్షాలు ధ్వజమెత్తాయి. రాజ్యసభలో బిల్ పాస్ కాకపోవడంతో ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఇక సెప్టెంబర్ 2018లో కూడా బిల్లు ఆమోదం పొందకపోవడంతో తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది

ట్రిపుల్ తలాక్ బిల్లు ఏమి చెబుతోంది..?

ట్రిపుల్ తలాక్ బిల్లు ఏమి చెబుతోంది..?

ట్రిపుల్ తలాక్ చెబితే ఇకపై అది నేరంగా పరిగణించబడుతుందని బిల్లు పేర్కొంటోంది. అంతేకాదు భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పిన ముస్లిం భర్తకు మూడేళ్లు జైలుశిక్ష విధించడం జరుగుతుంది. అయితే దీన్ని మజ్లిస్ ఎంపీ వ్యతిరేకించారు. ఇలా చేయడమంటే ముస్లిం వ్యక్తిని వేరు చేసి చూసినట్లుగానే భావించాల్సి వస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ట్రిపుల్ తలాక్ అనేది రాత పూర్వకంగా ఇచ్చినా, ఎలక్ట్రానిక్ రూపంలో ఇచ్చినా నేరంగానే పరిగణించబడుతుందని బిల్లులో ఉంది. ముస్లి చట్టాల ప్రకారం తలాక్ - ఈ- బిద్దత్ లేదా ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యకు భర్త విడాకులు ఇస్తారు. సుప్రీంకోర్టు ఈ పద్ధతి ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని రాజ్యాంగ విరుద్ధమని చెప్పేవరకు ముస్లిం భర్తలు భార్యలకు చాలా సింపుల్‌గా విడాకులు ఇచ్చేవారు. ఇదిలా ఉంటే బాధితురాలు లేదా ఆమెకు సంబంధించిన బంధువులు మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని బిల్లులో పొందుపర్చారు. ఇక ట్రిపుల్ తలాక్ చెప్తే బాధిత భార్య జీవనోపాధికి పిల్లలకోసం భర్త కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని బిల్లులో రూపొందించారు.

విడిపోయిన భర్తను పెళ్లి చేసుకోవాలంటే నిఖాహలాలా తప్పనిసరికాదు

విడిపోయిన భర్తను పెళ్లి చేసుకోవాలంటే నిఖాహలాలా తప్పనిసరికాదు

ట్రిపుల్ తలాక్ చెప్పి జైలు శిక్ష అనుభవించే వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయితే బెయిల్ ఇవ్వాలంటే బాధిత భార్య తరపున వాదనలు కూడా విన్న తర్వాతే మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయాలనిపిస్తే చేయొచ్చని బిల్లులో పేర్కొంటోంది. ఇక నిఖా హలాలా చెప్పకుండానే విడిపోయిన భార్యా భర్తల మధ్య అంగీకారం కుదిరితే తిరిగి ఇద్దరూ వివాహం చేసుకోవచ్చని బిల్లులో పొందుపర్చారు. ముస్లిం మతాచారం ప్రకారం భర్త నుంచి విడిపోయిన భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే నిఖా హలాలా అనే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. అయితే తిరిగి తన మాజీ భర్తనే పెళ్లి చేసుకోవాలంటే నిఖా హలాలా పాటించాల్సి ఉంటుంది. ఇక పిల్లలు కూడా బాధిత భార్య వద్దే ఉండొచ్చని తాజా బిల్లు పేర్కొంటోంది.

ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన దేశాలు ఇవే..!

ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన దేశాలు ఇవే..!

ఇక ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తున్నాయి. ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సిప్రస్, ట్యునీషియా, అల్జీరియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు ఉండగా ఈ జాబితాలో తాజాగా భారత్ చేరింది.

English summary
After undergoing many political hurdles finally triple talaq bill was passed in Rajyasabha. With this the bill will be moved for President's nod after which the bill will come into force. Many Muslim countries have banned the practice of triple talaq and in a fresh scenario India too joins this list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X