వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురిని చంపిన కేసులో ఇంద్రాణి: అక్రమ పెట్టుబడులు ఇన్ని కోట్లు?

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మెడకు సీబీఐ ఉచ్చు బిగుసుకుంది. బుధవారం లండన్ నుంచి చెన్నై చేరుకున్న కార్తీ చిదంబరంను విమానాశ్రయంలోనే అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. షీనా బోరా హత్య కేసులో జైల్లో ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీయా కంపెనీలతో కార్తీ చిదంబరంకు లింక్ ఉదని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇంద్రాణి, పీటర్ కంపెనీలు

ఇంద్రాణి, పీటర్ కంపెనీలు

2007లో ఫారిన్ ఇన్వేస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణి కంపెనీలల్లో రూ. 4.62 కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఇచ్చింది. అయితే పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణికి చెందిక కంపెనీల్లో మారిషస్ కు చెందిన రెండు కంపెనీలు అక్రమంగా రూ. 305 కోట్లు పెట్టబడులు పెట్టారని సీబీఐ గుర్తించింది.

రూ. 10 లక్షలు లంచం

రూ. 10 లక్షలు లంచం

పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణి కంపెనీల్లో అక్రమ పెట్టుబడుల విషయంలో విచారణకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ విచారణను అడ్డుకోవడానికి పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణిలు కార్తీ చిదంబరంకు రూ. 10 లక్షలు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇంద్రాణి పేరుతో కంపెనీలు

ఇంద్రాణి పేరుతో కంపెనీలు

పీటర్ ముఖర్జీయా తన రెండో భార్య ఇంద్రాణి పేరుతో ఒక్కసారిగా అనేక కంపెనీలు ప్రారంభించారు. వాటిలో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రై.లి, ఐఎన్ఎక్స్ మీడియా ప్రై.లి, ఐపీఎం ఇన్సాన్ ప్రై.లి, ఐఎన్ఎక్స్ ఎక్సిక్యూటివ్ ప్రై.లి తదితర కంపెనీలు ప్రారంభించారు.

షీనా బోరా హత్య

షీనా బోరా హత్య

2012 ఏప్రిల్ 24వ తేదీ కుట్రపన్ని షీనా బోరాను హత్య చేశారు. షీనా బోరా హత్యకు ముందే పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ఐఎన్ఎక్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. షీనా బోరా హత్య కేసులో సీబీఐ అధికారులు పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

సీబీఐ కస్టడీకి కార్తీ ?

సీబీఐ కస్టడీకి కార్తీ ?


సీబీఐ అధికారులు బుధవారం కార్తీ చిదంబరంను కోర్టులో హాజరుపరిచి విచారణకు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే కార్తీ చిదంబరంను కస్టడీకి ఇవ్వడానికి న్యాయస్థానం అనుమతి ఇవ్వవలసి ఉంది. మొత్తం మీద కార్తీ చిదంబరంను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు.

English summary
Karti Chidambaram was arrested today by the Central Bureau of Investigation in connection with the INX Media case. It has been alleged Karti had received money from the Peter-Indrani owned INX Media. It is also alleged that they wanted him to use his influence to manipulate a tax probe against it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X