• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ రెండు రాష్ట్రాల కోసమే కొత్తగా సహకార శాఖ - అదికూడా అమిత్‌షాకు: కేంద్రంపై విపక్షాలు ఫైర్

|

బుధవారం రోజున జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్తగా సహకార శాఖ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ శాఖపై ఇటు ప్రతిపక్షాలు అటు రాజకీయ విశ్లేషకులు విమర్శలు సంధిస్తున్నారు. కొత్తగా సహకార శాఖను సృష్టించడంపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. దీని వెనక బీజేపీ రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపణలు చేసింది. మరోవైపు సమాఖ్యవాదంపై బీజేపీ దాడి చేస్తోందని కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. సహకార శాఖ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని దీనిపై కేంద్రం పెత్తనం ఎలా చేస్తుందని ప్రశ్నించింది.

ఇప్పటికే 2002లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం ఉండగా మళ్లీ సహకార సంఘాలను తన చేతుల్లోకి తీసుకోవడం ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇది కేవలం మహారాష్ట్ర, గుజరాత్‌ సహకార సంఘాలపై పట్టు సాధించడం కోసమే బీజేపీ ఈ కుయుక్తులు పన్నుతోందని కాంగ్రెస్ విమర్శించింది. కేవలం ఆ రెండు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకునే కొత్తగా ఈ సహకార శాఖను సృష్టించిందని కాంగ్రెస్ మండిపడింది. మహారాష్ట్రలో సహకార సంఘాలు చాలామటుకు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల అధీనంలో ఉన్నందున వాటిపై బీజేపీ ఫోకస్ చేసి కావాలనే ఓ ఈ శాఖను సృష్టించి అది అమిత్ షాకు అప్పగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిగ్గా అమలుకావడం లేదనేది వాస్తవం. శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ శాఖ, సహకారం, మరియు రైతు సంక్షేమ శాఖలు ఆయన కిందే ఉండేవని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఆ సమయంలో ఆయనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని పూర్తి స్వేచ్ఛ ఉండేదని గుర్తుచేశారు. కానీ ఈ సహకార శాఖ అనేది కొత్తగా సృష్టించడం అదే సమయంలో అది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అప్పగించడం వెనక ఏదో దురుద్దేశం ఉందని కాంగ్రెస్ నాయకుడు ఒకరన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు స్కామ్ జరిగిందని.. ఈ కుంభకోణం అమిత్‌షా తీసుకున్న సహకార శాఖ కిందకు వస్తుందో లేదో వేచి చూడాలని చెప్పారు.

What is the need for creating a cooperation ministry,oppositions slams Centre

పాలనా పరంగా సహకార శాఖ అక్కర్లేదని అయితే రాజకీయ లబ్ధి కోసమే ఇది సృష్టించారనేది స్పష్టమవుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ మహారాష్ట్రల్లో అధిక సంఖ్యలో ఎంపీ సీట్లున్నాయని ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు లేనందున ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కుట్రలో భాగమే ఈ సహకార శాఖ అని పృథ్వీరాజ్ చవాన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలువురు బడాబాబులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించి వారు రుణాలు చెల్లించకుండా ఎగవేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులను కేంద్రం టార్గెట్ చేసిందని ఈ బ్యాంకుల ద్వారా మరింత లూటీ చేసేందుకు సన్నద్ధం అవుతోందని విమర్శించారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో 2 లక్షల కో-ఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయని ఇందులో దాదాపుగా 50.5 మిలియన్ మంది సభ్యులుగా ఉన్నట్లు సమాచారం.

English summary
Opposition slam centre as why there was a need to create cooperation ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X