వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర ఇదీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్ :2001 నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆధికారంలో ఉంది. అయితే ముఖ్యమంత్రులు మాత్రం మారారు. 1990లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1995లో స్వంతంగా గుజరాత్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.ఈ ఎన్నికల్లో కూడ అధికారాన్ని చేపట్టే దిశగా ఫలితాలు కన్పిస్తున్నాయి.ఇప్పటివరకు నాలుగు దఫాలు గుజరాత్ అసెంబ్లీ రద్దు చేశారు. పలు కారణాలతో అసెంబ్లీని రద్దు చేశారు.

Recommended Video

Gujarat Election Result Update 2017 : Congress In Leading | Oneindia Telugu

గుజరాత్ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వశక్తులను ధారపోసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడ ఈ గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో మోడీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.

కాంగ్రెస్ హవాను దెబ్బతీసిన బిజెపి

కాంగ్రెస్ హవాను దెబ్బతీసిన బిజెపి

గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికే పరిస్థితి నుండి బిజెపి వైపుకు మళ్ళారు. అయితే పలు దఫాలు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసిన ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు.అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్రంలో పుంజుకొంది. బిజెపి ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదు. 1952 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 దఫాలు విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఒక్కసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్ ఆధిపత్యాన్ని దెబ్బతీసిన విపక్షాలు

కాంగ్రెస్ ఆధిపత్యాన్ని దెబ్బతీసిన విపక్షాలు

కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని విపక్షాలు దెబ్బతీశాయి. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యాన్ని 1975తె దెబ్బకొట్టాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రంట్‌గా ఏర్పడిన పార్టీలు గుజరాత్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.బిజెఎస్, బిజెడి, ఎస్పీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఇదే తరహ ప్రయోగాలను విపక్షాలు చేశాయి.

సంకీర్ణ ప్రభుత్వాల్లో అసంతృప్తులు

సంకీర్ణ ప్రభుత్వాల్లో అసంతృప్తులు

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీలు కూటములు కట్టడం ప్రారంబించాయి. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయింది. 1980లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. 1980 ఫిబ్రవరిలో బాబుబాయి జె పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రభుత్వాన్ని జూన్ 6వ, తేదిన రద్దు చేశారు.ఆ తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి.1990లో జనతాదళ్ బిజెపిలు గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చిమన్‌బాయ్ పటేల్ సీఎంగా బాధ్యతలను నిర్వహించారు.1990 మార్చి4న ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే 1990 అక్టోబర్‌లోనే సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు వచ్చాయి. జెడి(జీ) కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చిమన్ బాయి పటేల్ సీఎంగా కొనసాగారు.

బిజెపి ప్రాబల్యంలోకి గుజరాత్

బిజెపి ప్రాబల్యంలోకి గుజరాత్

గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. తొలిసారిగా 1995లో ఏ పార్టీ మద్దతు లేకుండా బిజెపి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. అయితే కేశుభాయ్ పటేల్ 1995 మార్చి14న, సీఎంగా ప్రమాణం చేశారు. 1995 అక్టోబర్ 21వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అదే ఏడాది అక్టోబర్ 21న, బిజెపికి చెందిన సురేష్ మోహతా సీఎంగా బాధ్యతలను చేపట్టారు.1996 సెప్టెంబర్ 19వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు.

రాష్ట్రీయ జనతా పార్టీకి పట్టం

రాష్ట్రీయ జనతా పార్టీకి పట్టం

1996 రాష్ట్రీయ జనతా పార్టీ 1996 అక్టోబర్ 23న, అధికారంలోకి వచ్చింది. 1997 అక్టోబర్ 27వరకు ఆ పార్టీ అధికారంలో ఉంది. శంకర్‌సింగ్ వాఘేలా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.1997 అక్టోబర్ 28న, దిలిప్ పరిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.1998 మార్చి 4వరకు ఆయన సీఎం బాధ్యతలను నిర్వహించారు.

1998 నుండి బిజెపిదే అధికారం

1998 నుండి బిజెపిదే అధికారం

1998 నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది. 1998 మార్చి4వ,తేది నుండి కేశ్ బాయ్ పటేల్ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.2001 అక్టోబర్ 6వ, తేది వరకు కేశుభాయ్ పటేల్ ఈ పదవిలో ఉన్నారు.2001 అక్టోబర్ 7 నుండి 2014 మే 22వరకు నరేంద్రమోడీ సీఎం పదవిలో ఉన్నారు. 2014 మే 22 నుండి 2016 ఆగష్టు 7వరకు ఆనందీబెన్ పటేల్, 2016 ఆగష్టు 7 నుండి విజయ్ రూపానీ సీఎంగా కొనసాగుతున్నారు.

రాష్ట్రపతి పాలన

రాష్ట్రపతి పాలన

1971 మే 13 నుండి 1972 మార్చి 17 వరకు గుజరాత్ అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత 1974 ఫిబ్రవరి 9 నుండి 1975 జూన్ 18 వరకు అసెంబ్లీ రద్దైంది.1976 డిసెంబర్ 24 నుండి 1976 డిసెంబర్ 24 వరకు అసెంబ్లీ రద్దైంది.1980 ఫిబ్రవరి17 నుండి 1980 జూన్ 6 వరకు కూడ అసెంబ్లీ రద్దైంది.

English summary
four times gujarat assembly dissolved in gujarat from 1962.political reasons and other issues for assembly dissolved said political analysts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X