వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇండియా తొలి ప్రధాని ఎవరంటే' మోడీ ఫోటో చూపించిన గూగుల్, నటి రమ్య చురకలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోడీగా మార్చింది! భారత తొలి ప్రధాని అని వెతికితే ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కనిపించింది. దీంతో నెటిజన్లు సెటైర్లు వేశారు. భారత తొలి ప్రధాని గురించి వెతికితే వికీపీడియా లింక్‌ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్ పక్కనే మోడీ ఫోటోను చూపించింది.

ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతదేశపు మొదటి ప్రధాని అని వెతికితే చేస్తే నెహ్రూ సమాచారంతో పాటు ప్రస్తుత ప్రధాని మోడీ ఫొటో దర్శనం ఇవ్వడంతో పలువురు నెటినజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 What Jawaharlal Nehru looks like according to Google India

పొరపాటును గుర్తించిన గూగుల్‌ దానిని సరిచేసింది. అలాగే భారత దేశ మొదటి ఆర్థిక మంత్రి అని టైప్‌ చేస్తే ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫొటో, మొదటి రక్షణ మంత్రి అని టైప్‌ చేస్తే ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫొటోలు వచ్చాయి.

నెహ్రూ సమాచారం పక్కన మోడీ ఫొటో కనిపించిన స్క్రీన్‌షాట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గూగుల్‌ తప్పిదంపై చాలామంది విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇంచార్జ్ దివ్య స్పందన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గూగుల్‌ ఇండియా! ఏ అల్గారిథం ఇలా చూపిస్తోంది? మీ వద్ద చాలా జంక్‌ ఉంది' అని ట్వీట్ చేశారు.

English summary
Curious netizens took to Twitter late on Wednesday night to share screenshots of Google's "faux pas" search results of India's first Prime Minister which mysteriously displays India's current PM Narendra Modi's photo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X