వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అనిపిస్తే వైరసే.. వైద్యులు ఏం చెబుతున్నారు..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రక్కసి చాపకింద నీరులా మెల్లమెల్లగా ఇతరదేశాలకు వ్యాపిస్తోంది. చైనాలోని వుహన్ నగరంలో బయటపడ్డ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ సోకి చైనాలో ఇప్పటికే 106 మంది చనిపోగా.. వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వైరస్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి, నిపుణులు ఏం చెబుతున్నారో చుద్దాం పదండి.

దూరం.. దూరం...

దూరం.. దూరం...

వైరస్ బారినుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే.. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న.. దగ్గుతున్న, తరచుగా తుమ్ములు వస్తోన్న వారి వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారితో కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలా మొదలై న్యూమోనియాకు దారితీసి, కిడ్నీ ఫంక్షన్ సరిగా జరగక మరణానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా వైరస్ జంతువు నుంచి ప్రారంభమై మనుష్యులకు వస్తోందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీంతో మాంసం, కోడిగుడ్లను తినొద్దని సూచిస్తున్నారు. అంతేకాదు జంతువుల మార్కెట్లు/ మాంసం విక్రయించే చోట ఉంటోన్న ప్రజలకి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

శుభ్రత.. పరిశుభ్రత...

శుభ్రత.. పరిశుభ్రత...

సాధారణంగా జలుబు, దగ్గు వస్తే ఏం చేస్తుంటారు అని వాషింగ్టన్ ఆరోగ్యశాఖ కార్యదర్శి అడిగారు. ఇక్కడే తొలి కరోనా కేసు నమోదవడం విశేషం. సబ్బుతో చేతిని 20 సెకండ్లపాటు కడుక్కొవాలని సూచించారు. అనారోగ్యంతో దగ్గే/తుమ్మే సమయంలో నోరు, ముక్కును రుమాలుతో పట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మీరు పట్టుకున్న వెంటనే క్రిములు రావడం వల్ల వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కొవాలని సూచిస్తున్నారు. ఒకవేళ కరోనా వైరస్ అని భావిస్తే మాత్రం సర్జికల్ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.

తప్పదనుకుంటే మాత్రమే..

తప్పదనుకుంటే మాత్రమే..

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయినా మీరు పర్యటించాలనుకుంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ చైనా వారి న్యూ ఇయర్ సమయంలో రావడం ఇబ్బందికి గురిచేస్తోంది. కోట్లాది మంది స్వస్థలాలకు ప్రయాణించడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత శనివారం ప్రారంభమైన వేడుకలు మరో రెండు వారాలపాటు జరుగుతాయి. కరోనా వైరస్ బయటపడిన వుహన్‌లో లెవన్ 3గా సీడీసీ నిర్ణయించింది. మిగతా చైనాలోని ఇరత ప్రాంతాలు లెవల్ 1 వద్ద ఉన్నాయి.

రిస్క్ అని...

రిస్క్ అని...

అమెరికా ప్రజలు మాత్రం తమ స్నేహితులు, కుటుంబసభ్యులను కలుసుకొనేందుకు అమెరికా వెళ్లడం రిస్క్‌గా భావిస్తున్నారు. ఈ సమయంలో పర్యటించడం కంటే.. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవడం మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ చైనా వెళ్లడం తప్పదనుకొంటే సీడీసీ సలహామేరకు నడుచుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్య సంరక్షుడు మీకు కావాల్సిన వ్యాక్సినేషన్, పర్యటన గురించి సలహాలు అందిస్తారని పేర్కొన్నారు. అమెరికా ప్రజలు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీచేసే హెచ్చరికలను, అమెరికా ఎంబసీ తెలియజేసే టిప్స్ పాటించాలని కూడా కోరుతున్నారు.

కాస్త రిలీఫ్..

కాస్త రిలీఫ్..

డ్రాగన్ కంట్రీని వణికిస్తోన్న కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. పక్కనే ఉండే భారత్ కూడా అలర్టైంది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. దీంతో చైనా వెళుతోన్న, తిరిగి వస్తోన్న ప్రయాణికులకు కేంద్ర ఆరోగ్యశాఖ సలహాలు, సూచనలను అందజేసింది. అంతగా అవసరం లేకుంటే చైనా వెళ్లొద్దని సూచిస్తోంది.

Recommended Video

Coronavirus Symptoms : Is This A Global Emergency? All You Need To Know || Oneindia Telugu
సందేహం వస్తే..

సందేహం వస్తే..

చైనాలో పర్యటించే సమయంలో ఎవరైనా అనారోగ్య బారినపడితే వెంటనే భారత ఎంబసీ +8618612083629 లేదంటే +8618612083617 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. చైనా నుంచి వచ్చిన నెలరోజుల తర్వాత అనారోగ్యానికి గురైనట్టు అనిపిస్తే వారిని ఇతరుల నుంచి వేరుచేసి వైద్యం అందజేయాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్యుల సలహాలను పాటించాలని, అవసరమనుకుంటే 011-23978046 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

జాగ్రత్తలు ఇవే..

జాగ్రత్తలు ఇవే..

1.పరిశుభ్రంగా ఉండటం

2.తరచూ చేతులను సబ్బుతో కడగడం

3.తుమ్మేటప్పుడు/దగ్గేటప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం

4.ఇతరులకు దూరంగా ఉండటం/ వారిని అంటుకోవడం ద్వారా వారికి వైరస్ సోకే ప్రమాదం

5. జంతువులకు దూరంగా ఉండటం/ మాంసం కోసే దగ్గర ఉండే ప్రజలు దూరంగా ఉండాలి

6. కరోనా వైరస్ ఉందని భావిస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి

English summary
Coronavirus Live Updates:Avoid close contact with anyone showing symptoms of respiratory illness, such as coughing and sneezing, the World Health Organization said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X