వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్, కార్ల ధరలు పైపైకి, తగ్గనున్న సోలార్ టెంపర్ గ్లాస్ ధరలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మొబైల్స్, గడియారాలు, కళ్ళజోళ్ళు, సిగరెట్ లైటర్లు, వంటనూనెలు, సిల్క్ దుస్తులు, షేవింగ్ క్రీముల తదితర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. సోలార్ టాంపర్డ్ గ్లాసెస్ జీడిపప్పు, సెలెక్టెడ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

Recommended Video

Union Budget 2018 : Agriculture, Health, Education got big Budgetary Allocations

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు 2018 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్ పై ఉద్యోగులకు పన్ను పరిమితిని పెంచలేదు.మరో వైపు గ్రామీణ ప్రాంత ప్రజలను ఉద్దేశించి కొంత వరాలను కురిపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విదేశాల నుండి ఎక్కువగా దిగుమతి చేసుకొనే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొంది.

 కార్లు, మొబైల్స్ ధరలు పెరగనున్నాయి

కార్లు, మొబైల్స్ ధరలు పెరగనున్నాయి

విదేశాల నుండి దిగుమతి చేసుకొన్న వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 15 నుండి 20 శాతం వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో మొబైల్స్, కార్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.సన్ స్క్రీమ్స్, డెంటల్ కు సంబంధించిన వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

 ఎల్ ఈ డీ టీవిలపై ధరలు పైకి

ఎల్ ఈ డీ టీవిలపై ధరలు పైకి

ఎల్ఈడీ టీవీల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఫర్నీచర్ ధరలు కూడ పెరగనున్నాయి. మరో వైపు చెప్పుల ధరలు, సిల్క్ వస్త్రాల ధరలు పెరగనున్నాయి. రంగు రాళ్ళ ధరలు కూడ పెరగనున్నాయి.డైమండ్ ధరలు కూడ పెరిగే అవకాశం ఉంది.స్మార్ట్ వాచీల ధరలు పెరిగే అవకాశం ఉంది. మోటార్ బైక్ ల ధరలు పెరగున్నాయి, ఆటో మొబైల్స్ స్పేర్ పార్ట్ కూడ పెరగనున్నాయి.

 వంట నూనెల ధరలు పెరుగుతాయి

వంట నూనెల ధరలు పెరుగుతాయి

వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయిల్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, ధరలు కూడ పెరగనున్నాయి. స్పోర్ట్స్ వస్తువులు, స్మిమ్మింగ్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.వీడియో గేమ్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

ధరలు తగ్గే వస్తువులివే

ధరలు తగ్గే వస్తువులివే

సోలార్ టాంపర్డ్ గ్లాస్ ధరలు తగ్గనున్నాయి. సోలార్ గ్లాసుల తయారీ కోసం ఉపయోగించనున్నారు. ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీడిపప్పు ధరలు తగ్గనున్నాయి.

English summary
It's the perennial question after every Budget: What's cheaper and what's going to pinch me. A decent chunk of imported items including mobile handsets, cars and motorcycles, fruit juices, perfumes and footwear will become costlier as the Finance Minister Arun Jaitley hiked customs duties on these products in his Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X