వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ వ్యాఖ్యలు బాధించాయి, కానీ కావేరీకి-కాలాకు ఏం సంబంధం: ప్రకాశ్ రాజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

కాలా సినిమా వల్ల వారికి వచ్చే లాభం ఏమిటి? ప్రకాశ్ రాజ్

బెంగళూరు: రజనీకాంత్ చిత్రం 'కాలా'ను కర్ణాటకలో రద్దు చేస్తామని చెప్పడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడుతున్నారు. ఆయన కాలా సినిమాకు మద్దతుగా నిలిచారు. సూపర్ స్టార్ రజనీ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, అయితే సినిమాకు, ఆయన మాటలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కావేరీ జలాలకు, కాలా సినిమాకు సంబంధం లేదన్నారు.

పవన్ కళ్యాణ్ 'మహాకుట్ర'-ఆపరేషన్ గరుడ: 'శివాజీతో పలికించి, బాబుగారూ! ఏం ఐడియా, సాబ్జీ'పవన్ కళ్యాణ్ 'మహాకుట్ర'-ఆపరేషన్ గరుడ: 'శివాజీతో పలికించి, బాబుగారూ! ఏం ఐడియా, సాబ్జీ'

కావేరీ వివాదం నేపథ్యంలో రజనీకాంత్, కమల్ హాసన్‌లు చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి సినిమాలు ఆడనీయమని హెచ్చరించారు. ఇప్పుడు కాలా ఉండటంతో దానిని విడుదల కానివ్వమని రాష్ట్రంలో నిషేధం విధించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు.

కావేరీకి, కాలాకు సంబంధం ఏమిటి?

కావేరీకి, కాలాకు సంబంధం ఏమిటి?

మనిషికి, నదికి మధ్య అనుసంధానం ఉందని ప్రకాశ్ రాజ్ అన్నారు. అందుకే కావేరీ నది గురించి మాట్లాడినప్పుడల్లా మనం ఉద్వేగానికి లోనవుతుంటామని పేర్కొన్నారు. ఉద్వేగంతో సమస్యలు పరిష్కారం కావన్నారు. అసలు కావేరీ నీటి గొడవకు, కాలాకు సంబంధం ఏమిటన్నారు. ఎప్పుడూ చిత్రపరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తారని ప్రశ్నించారు.

మేం వారికి బాధ్యతలు గుర్తు చేయాల్సి వస్తోంది

మేం వారికి బాధ్యతలు గుర్తు చేయాల్సి వస్తోంది

ఈ విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా లేక పద్మావత్ విషయంలో చేసినట్లే చేస్తాయా అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి కావేరీ సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు. రాజకీయ కారణాలతో, ఒత్తిడితో ప్రభుత్వాలు స్పందించకపోవడం వల్ల మేం వారికి బాధ్యతలు గుర్తు చేయాల్సి వస్తోందన్నారు.

కాలా సినిమా వల్ల వారికి వచ్చే లాభం ఏమిటి?

కాలా సినిమాను ఆపడం వల్ల లాభం ఏమిటో ఆలోచించాలని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. రజనీ చేసిన వ్యాఖ్యలు బాధించాయని, ఆ కోపంతో ఆన సినిమాను నిషేధించాలని చూస్తున్నారని, కానీ కన్నడిగులకు కావాల్సింది సినిమా నిషేధం కాదని అభిప్రాయపడ్డారు. కన్నడిగులకు ఏం కావాలో నిర్ణయించడానికి వారెవరన్నారు. అది ప్రజలు తేల్చుకుంటారని అభిప్రాయపడ్డారు.

వారు నష్టపోవాలా?

సినిమాల కోసం నిర్మాతలు చాలా కష్టపడతారని, వారి కష్టం ఏం కావాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. రజనీ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు నష్టపోవాలా అని ప్రశ్నించారు. సినిమాను బ్యాన్ చేస్తే థియేటర్లో క్యాంటీన్లు నడిపేవారు, రోజూ సైకిళ్లపై తిరుగుతూ పోస్టర్లు అంటించేవారు నష్టపోతారన్నారు. ఆందోళనల సమయంలో వాహనాలు తగలబెడుతున్నారని, పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారన్నారు. ఆందోళనల వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ద్వేషం పెరుగుతోందన్నారు. కొందరు భావోద్వేగాలతో ఆడుకుంటున్నారన్నారు.

English summary
Actor Prakash Raj on Monday extended his support to Rajinikanth’s upcoming film ‘Kaala’, which is facing trouble in Karnataka over the Tamil superstar’s stand on the Cauvery water sharing dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X