వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: భారీగా ఉద్యోగులను నియమించుకోనున్న ఐటీ కంపెనీలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మందగమనం నేపథ్యంలో ఉద్యోగుల్లో కోత విధిస్తున్న తరుణంలో ఇండియాలో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకొంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పులు సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావంాన్ని చూపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను తీసుకొన్న తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయాన్ని ఇండియాకు చెందిన టెక్కీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఇండియాకు చెందిన టెక్కీలపై, సాఫ్ట్‌వేర్ కంపెనీలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.దీంతో ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకొనేపనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి.

భారీగా టెక్కీల రిక్రూట్‌మెంట్

భారీగా టెక్కీల రిక్రూట్‌మెంట్

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల కోత విధిస్తున్న తరుణంలో ఇండియాలో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీగా రిక్రూట్‌మెంట్‌ను చేపడుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకొంటున్నాయి. ఈ పరిస్థితి ఇండియన్ టెక్కీలకు ప్రయోజనం కల్గించేదిగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

IT Boom Has Been Reduced Future Jobs in These Sectors - Oneindia Telugu
యాక్సెంచర్‌లో 5,396 మందికి ఉద్యోగాలు

యాక్సెంచర్‌లో 5,396 మందికి ఉద్యోగాలు

యాక్సెంచర్ కంపెనీ ఇండియాలో 5396 మందిని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రాసెస్‌ను కూడ ప్రారంభించింది.ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని 2649 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది.ఇక ఒరాకిల్ భారత్‌లో 1124 మందిని నియమించుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఎంఎన్‌సీలు ఇండియాలో బారీగా రిక్రూట్‌మెంట్లు

ఎంఎన్‌సీలు ఇండియాలో బారీగా రిక్రూట్‌మెంట్లు

భారత్‌లో గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లను కలిగిన బహుళజతి సంస్థలు ఈ ఏడాది భారీగా ఉద్యోగులను నియమించుకొనే అవకాశాలున్నాయని జిన్నోవ్ అంచనావేస్తోంది. ఈ సంస్థలు భారత్‌లో సుమారు 30వేలకు పైగా ఉద్యోగులను నియమించుకొనే అవకాశాలున్నాయని ఆ సంస్థ అంచనా వేసింది.

ఇండియా సంస్థల్లో ఉద్యోగుల్లో కోత

ఇండియా సంస్థల్లో ఉద్యోగుల్లో కోత

ఇండియాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోతను విధిస్తున్నాయి. టీసీఎస్, ఇన్పోసిస్, టెక్ మహీంద్ర లాంటి సంస్థలు ఉద్యోగాల్లో కోతను విధిస్తున్నాయి. కానీ, ఎంఎన్‌సీ సంస్థలు మాత్రం భారీగా ఇండియాలోని తమ శాఖల్లో ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఎంఎన్‌సీ సంస్థల కారణంగా ఇండియన్ టెక్కీలకు మంచి అవకాశం దక్కనుంది.

English summary
The Indian IT services sector may be passing through some rough weather with challenges of automation and lower growth rates, forcing many to lay off employees and reduce the rate of hiring. But many technology MNCs in the country are continuing to hire in large numbers. Companies such as Accenture, Capgemini, Oracle, IBM, and Goldman Sachs are hiring in hundreds, some in thousands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X