వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Citizenship Bill: ‘బిల్లుపై ఎందుకంత తొందర? దేశ విభజనపై కాంగ్రెస్‌ను అంటారా?’

|
Google Oneindia TeluguNews

Recommended Video

Citizenship Amendment Bill 2019 : Will CAB Clear Rajya Sabha? || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతీయ విలువలకు పౌరసత్వ బిల్లు విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆనంద్ శర్మ మాట్లాడారు. ఈ బిల్లు వివక్షతో కూడుకున్నదని అన్నారు.

Citizenship Bill: సువర్ణాక్షరాలతో లిఖించాలి.. పాకిస్థాన్ భాషలో ప్రతిపక్షాలు: మోడీ కీలక వ్యాఖ్యలుCitizenship Bill: సువర్ణాక్షరాలతో లిఖించాలి.. పాకిస్థాన్ భాషలో ప్రతిపక్షాలు: మోడీ కీలక వ్యాఖ్యలు

దేశ విభజనకు కాంగ్రెస్ కారణమంటూ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని ఆనంద్ శర్మ కేంద్రంపై మండిపడ్డారు. దేశ విభజనకు కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు పలకలేదన్నారు. అమిత్ షా రాజకీయాలు పార్లమెంటు బయటే చేయాలన్నారు. రెండు దేశాల సిద్ధాంతం అనేది వీర్ సావర్కర్ ఆలోచనేనని శర్మ అన్నారు.

What was Centres rush to get this Bill passed, asks Anand Sharma

ముస్లీం లీగ్‌ను బ్రిటీష్ వారే ప్రోత్సహించారని, కాంగ్రెస్ పార్టీపై నిషేధం విధించిందన్నారు. రెండు దేశాలు ఏర్పడటానికి ముస్లింలీగ్, హిందూ మహాసభలే కారణమని ఆనంద్ శర్మ ఆరోపించారు. బ్రిటీష్ వారి జోక్యాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన అమిత్ షాను ప్రశ్నించారు. జిన్నా కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పౌరసత్వ బిల్లులతో రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తున్నారని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. ఇంత అత్యవసరంగా ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ప్యానెల్ పరిశీలనకు పంపాలని ఆయన అన్నారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ బిల్లుతో భారత ఆత్మ క్షోభిస్తోందని, విలువల పరీక్షలో

కేంద్రమంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని, గత ఐదేళ్ల నుంచే అక్కడ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. గత 65ఏళ్ల జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిందని ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.

English summary
What was Centre's rush to get this Bill passed, asks Anand Sharma in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X