వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీ కాకుండా సెల్వం వెనక్కి: జయలలిత వ్యూహం ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన మరుక్షణమే అన్నాడియంకె అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూర్చుంటారంటూ మీడియా ఊహాగానాలు చేసింది. కానీ, అదేం జరగలేదు. జయలలిత వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆమె ఎవరితోనూ తన వ్యూహంపై మాట్లాడడం లేదు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ఎంతో కాలం లేదు. ఈ స్తితిలో ఆమె మధ్యంతర ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. కానీ ఆ ఊహాగానాలను అన్నింటినీ తిప్పికొట్టే వ్యూహరచనలో ఆమె ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తనను కలిసి పలకరించేందుకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఆమె లోపలికి కూడా రానివ్వలేదు. ఇంటర్కంలోనే మాట్లాడి పంపించి వేశారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే విషయంలో ఆమె పునరాలోచన చేస్తున్నట్లు తాజాగా ప్రచారం సాగుతోంది.
ఆచితూచి చాలా జాగ్రత్తంగా ముందుకు అడుగేయాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాల ఎత్తును అనుసరించి తాను రాజకీయ వ్యూహాన్ని రచించుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. తదుపరి పరిణామాలను అంచనా వేస్తూ ఆమె వేచి ఉండే ధోరణి అవలంభిస్తున్నారని అంటున్నారు.

జయలలితకు కర్ణాటక హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చి రెండు రోజులు అవుతున్నా అన్నాడిఎంకే ఎక్కడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అందరూ జయలలిత నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడడం లేదు.

 What will be political strategy of Jayalalithaa?

సాధారణంగా కింద కోర్టులో కేసుపై తమ వ్యతిరేకంగా తీర్పు వస్తే పైకోర్టుకు అప్పీలుకు వెళ్ళతారు. ఇది సహజం ఇపుడు ఆ వంతు విపక్షాలకు వచ్చింది. జయ నిర్దోషిగా బయట పడితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న పార్టీలన్నీ అప్పీలు కోసం పట్టుపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తెస్తున్నాయి.

హైకోర్టు తీర్పు అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చి స్టే విధిస్తే వెంటనే జయలలితకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితులలో అలా తిరిగి రాజీనామా చేయాల్సి వస్తే సీన్ పూర్తిగా రివర్స్ అవుతుందని జయలలిత ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ స్థితిలో తొందరపడి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టరాదని జయలలిత భావిస్తున్నట్లు సమాచారం. జయ కేసులో తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, కొందరు మంత్రులతో కలిసి జయ నివాసానికి వెళ్లినా ఆమె నేరుగా మాట్లాడలేదనే సంగతి మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇంటి ప్రాంగణంలోని ఇంటర్‌కమ్ ఫోన్ ద్వారా మాత్రమే పన్నీర్ సెల్వం బృందాన్ని పలకరించి పంపివేసినట్లు తెలిసింది.

సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఉన్న తరుణంలో తొందరపడి సీఎం పీఠం ఎక్కి చిక్కుల్లో పడడం ఇష్టం లేదని అంటున్నారు. పదవి కోసం తహతహలాడుతున్నట్లు కనిపించకూడదనేది కూడా ఆమె ఉద్దేశంగా చెబుతున్నారు. అప్పీలుపై కర్ణాటక ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన అనంతరమే సీఎం పగ్గాలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.

English summary
It is said that AIDMK chief Jayalalithaa is not showing eagerness to become cM of Tamil Nadu soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X