వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WhatsApp:ఐఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్..వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్స్ ఇవే..!

|
Google Oneindia TeluguNews

ఐఫోన్ యూజర్లకు ప్రముఖ ఇన్స్‌టాంట్ చాటింగ్ యాప్ వాట్సాప్ నుంచి గుడ్ న్యూస్. ఐఫోన్‌ వినియోగిస్తున్న వారు వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఇందులో కొత్త ఫీచర్స్ వస్తాయని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. న్యూ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్, కాల్ వెయిటింగ్, బ్రెయిలీ కీబోర్డు ఇంటిగ్రేషన్‌తో పాటు కొత్తగా డిజైన్ చేసిన స్క్రీన్ చాట్‌లు అప్‌డేట్ అయ్యాయి.

WhatsAPP: లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి...ఎంపీ 4 ఫైలు ద్వారా హ్యాకింగ్WhatsAPP: లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి...ఎంపీ 4 ఫైలు ద్వారా హ్యాకింగ్

2.19.120 వర్షెన్ కలిగి ఉన్న వాట్సాప్‌ కొత్త వర్షన్ ఐఫోన్ యాప్ స్టోర్‌లో ఉందని వెల్లడించింది. వినియోగదారులు లేటెస్ట్ వర్షన్‌ను తమ ఐఫోన్‌ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సాప్ వర్షన్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌లో వ్యక్తులను బ్లాక్ చేసే మరో ఆప్షన్ ఇచ్చారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాట్సాప్‌ గ్రూపుల్లో ఎవరిని బ్లాక్ చేయాలో మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకునేలా కొత్త ఆప్షన్ ఇచ్చారు. ఇక యూజర్ ఒక కాల్‌పై ఉన్న సమయంలో మరో కాల్ వస్తే కాల్ వెయిటింగ్ కనిపిస్తుంది. మరో కాల్ మాట్లాడుతూనే కాల్ వెయిటింగ్‌లో ఉన్న కాల్‌ను తీసుకోవచ్చని యాజమాన్యం పేర్కొంది. అంతకుముందు కాల్ వెయిటింగ్‌లో ఉండేదని మాత్రమే యూజర్‌కు తెలిసేది కానీ మాట్లాడే అవకాశం ఉండేది కాదు.

WhatApp News: Updated features on WhatsApp for Iphone Users

ఇక చివరిగా ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్‌లో చాట్ స్క్రీన్‌ను రీడిజైన్ చేశారు. చాట్ మెసేజెస్‌ను త్వరగా చూసుకునే వీలు కల్పించింది. అంతేకాదు ఇందులో టెక్ట్స్‌ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని యాజమాన్యం తెలిపింది.ఇక అంధులకు బ్రెయిలీ కీబోర్డు సపోర్టును తీసుకొచ్చింది. వాయిస్ ఓవర్ మోడ్ ద్వారా నేరుగా మెసేజ్‌లు అవతల వ్యక్తికి పంపేలా డిజైన్ చేసింది.

English summary
WhatsApp has a new update for iPhone users. WhatsApp’s latest update for iPhones brings important features like the new group privacy settings, call waiting, Braille keyboard integration and also a redesigned chat screen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X