వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ లో కొత్త ఫీచర్: 5నిమిషాల్లో పంపిన మేసేజ్ మాయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ లో త్వరలో మరో సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది.ఎప్పటికప్పుడు యాప్ ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది.

దీని ప్రకారంగా ఎవరైనా అవతలి వ్యక్తికి మేసేజ్ పంపిన అనంతరం అది 5 నిమిషాల తర్వాత మాయమౌతోంది. ఎప్పుడు మాయమైపోతోందనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.

ప్రస్తుతం వాట్సాప్ వెబ్ వెర్షన్ 0.2.4077 ద్వారా మాత్రమే ఈ ఫీచ్ అందుబాటులోకి వచ్చింది. సెట్టింగ్ లో దీన్ని ఆన్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

WhatsApp Beta for Android Update Adds New Font Shortcuts, Revoke Feature Spotted on Web Version

అయితే మనం పంపే సందేశంలోని ఫాంట్ లను పార్మెట్ చేసుకొనేలా కొత్త సౌలభ్యాన్ని వాట్సాప్ తన బీటా వెర్షన్ 2.17.148 ద్వారా అందిస్తోంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకొంటే ఏదైనా టెక్స్ట్ ను టైప్ చేశాక దాన్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్ ఇటాలిక్ ఫార్మాట్ లోకి మార్చడం వీలౌతోంది.

మనం పంపే సందేశంలో అత్యవసర విషయాన్ని ఈ సదుపాయం ద్వారా మరింత సమర్థంగా పంపొచ్చు. ప్రస్తుానికి ఈ ఫీచర్స్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయో సమాచారం లేదు. ఇప్పటికే ఆండ్రాయిడ్ నోగట్ వెర్షన్ వాడుతున్నవారు తమ ఫోన్ లో గూగుల్ ట్రాన్స్ లేట్ ఉండి ఉంటే ఆయా మేసేజ్ లను అక్కడే ట్రాన్స్ లేట్ చేసుకొనేలా ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

English summary
WhatsApp has been believed to be testing the message revoke feature for months now. Earlier, WhatsApp for iPhone was spotted with the new feature that allowed users to revoke or edit messages you have already sent to other contacts. Now, the feature seems to close to be released on Android as well as WhatsApp Web.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X