వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ టాయ్స్ కొనిచ్చి.. చెప్పరాని హింసలు: వాట్సాప్ ఆధారంగా దేశంలోనే తొలి శిక్ష!

చెప్పరాని మాటలతో వాట్సాప్ సందేశాలు పెట్టేవారు.ఆపై ఆమె నగ్న చిత్రాలను స్నేహితులతో పంచుకుని, యాపిల్ ఐ క్లౌడ్ అనే సాఫ్ట్ ద్వారా భద్రపరిచారు.

|
Google Oneindia TeluguNews

సోనేపట్: ఓ వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన తొలి కేసు హర్యానాలో నమోదైంది. తమ జూనియర్ ను రెండేళ్ల పాటు తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గాను హర్యానా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో వాట్సాప్ చాట్ సంభాషణలనే కోర్టు సాక్ష్యాధారాలుగా పరిగణించింది. ఇలా వాట్సాప్ సాక్ష్యాలతో ఓ కేసులో నిందితులకు శిక్ష పడటం ఇదే తొలిసారి అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని సోనెపట్ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్ధిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్ విద్యార్థులుగా ఉన్నారు. 2013అగస్టులో వర్సిటీలోని న్యాయ విద్య విభాగంలో ఒక అమ్మాయి చేరింది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఎలాగైన వశపరుచుకోవాలని వారు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించారు. బలవంతంగా ఎక్కడిక్కడో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తిరిగి వర్సిటీకి తీసుకొచ్చేవారు.సెక్స్ టాయ్స్ కొనిచ్చి, వాటిని వాడి.. ఆ వీడియోలను తమకు పంపించాలంటూ బాధితురాలిని తీవ్రంగా వేధించారు. చెప్పరాని మాటలతో వాట్సాప్ సందేశాలు పెట్టేవారు.ఆపై ఆమె నగ్న చిత్రాలను స్నేహితులతో పంచుకుని, యాపిల్ ఐ క్లౌడ్ అనే సాఫ్ట్ ద్వారా భద్రపరిచారు.

WhatsApp chats land three law students of Sonepat univ in prison for rape

తమ వేధింపుల విషయం బయటకు లీకైతే అంతే సంగతులని బాధితురాలిని బెదిరించేవారు. కానీ ఎట్టకేలకు బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిజాలన్ని వెలుగుచూశాయి. నిందితుల వాట్సాప్ చాట్ ను పరిశీలించిన న్యాయస్థానం.. వాటినే సాక్ష్యాలుగా పరిగణిస్తున్నామని పేర్కొంది.

అత్యంత అసభ్యకర రీతిలో ఆ సంభాషణలు ఉన్నందునా.. వాటిని వెల్లడించలేకపోతున్నామని న్యాయమూర్తి సునీతా గ్రోవర్ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు 20ఏళ్ల జైలు శిక్ష, మరో విద్యార్థికి 7ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో కోర్టు వెలువరించిన తుది తీర్పు ఇది.

English summary
Detailed and explicit WhatsApp conversations between a rape victim and three law students of a private university in Haryana proved crucial evidence for their conviction by a trial court, show documents made available on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X