వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ సేవలకు అంతరాయం: విలవిల్లాడిన యూజర్లు, ట్విట్టరెక్కేశారు..!

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు పంపించడం వీలు కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4.15గంటల ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు.

భారత్ సహా ఈ దేశాల్లో రెండుగంటలపాటు నిలిచిన సేవలు

భారత్ సహా ఈ దేశాల్లో రెండుగంటలపాటు నిలిచిన సేవలు

దాదాపు రెండుగంటల తర్వాత వాట్సాప్ సేవలు యథాతథంగా అందుబాటులోకి వచ్చాయి. భారత్ సహా బ్రెజిల్, యూఏఈలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆండ్రాయిడ్ తోపాటు ఐవోఎస్ వినియోగదారులూ ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సాప్ స్టేటస్, వీడియోలు, ఫొటోలను తాము వీక్షించలేకపోయామని వినియోదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ వీడియో కూడా డౌన్ లోడ్ కాలేదని ఫిర్యాదు చేశారు.

మళ్లీ పనిచేయడంతో ఊపిరిపీల్చుకున్నారు..

మళ్లీ పనిచేయడంతో ఊపిరిపీల్చుకున్నారు..

వాట్సాప్ సరిగా పనిచేయకపోవడంతో యూజర్లు మెసేజ్‌లు పంపడం, రిసీవ్ చేసుకోవడంలో కూడా సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. అయితే, టెక్ట్స్ మెసేజ్ లు మాత్రం యథావిధిగా పనిచేశాయి.

మళ్లీ రెండుగంటల తర్వాత వాట్సాప్ అన్ని సేవలు యథావిధిగా పనిచేయడంతో వినియోగదారులంతా ఊపరిపీల్చుకున్నారు.

ట్విట్టర్‌లో వాట్సాప్ ట్రెండింగ్...

ట్విట్టర్‌లో వాట్సాప్ ట్రెండింగ్...

కాగా, 2020లో వాట్సాప్ సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి. #whatsappdown అనే హాష్‌ట్యాగ్‌తో వాట్సాప్ వినియోగదారులు ట్విట్టర్ వేదికగా తమ గోడును వెల్లబోసుకున్నారు. మొదట ఇంటర్నెట్ సమస్య అనుకున్న వినియోగదారులకు.. ట్విట్టర్ వేదికగా వాట్సాప్ పనిచేయడం లేదంటూ ట్రెండ్ అవడంతో అసలు విషయం తెలిసింది. దీంతో ట్విట్టర్‌లో కొందరు నెటిజన్లు వాట్సాప్‌పై జోకులు పేల్చారు.

English summary
There seems to be an apparent error on the popular social messaging app WhatsApp as thousands of users all over the world started reporting issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X