వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్‌బెర్రీ, నోకియా పెద్దదెబ్బ: వాట్సప్ సేవలు నిలిపివేత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్లాక్ బెర్రీ, నోకియా మొబైల్ వినియోగదారులకు చేదువార్త. బ్లాక్ బెర్రీ, నోకియా ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే మొబైల్ హ్యాండ్ సెట్లలో మెసెంజర్ యాప్ వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్లాక్ బెర్రీ (బ్లాక్ బెర్రీ 10 సహా), నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్ 60, ఆండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ ఫోన్ 7.1 ఓఎస్‌లపై పనిచేసే ఫోన్లలో వాట్సప్ సేవలను ఈ ఏడాది చివరి నాటికి నిలిపివేస్తున్నట్లు వాట్సప్ సంస్ధ ప్రకటించింది.

అంతేకాదు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.5 శాతం వరకు స్మార్ట్ ఫోన్లు గూగుల్, మైక్రోసాప్ట్, యాపిల్ కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)లపై పనిచేస్తున్నాయని ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు వినియోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ పైనే దృష్టి సారించినట్లు పేర్కొంది.

మరో మైలురాయికి వాట్సప్: యూజర్ల సంఖ్య 100 కోట్లు

WhatsApp to end support for BlackBerry, Nokia, and other older operating systems by the end of 2016

2009లో వాట్సప్ ప్రారంభించే నాటికి, ఇప్పటికి మొబైల్ హ్యాండ్ సెట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని వివరించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 2014 ఫిబ్రవరిలో వాట్సప్‌ను 19 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇటీవలే వాట్సప్ యాప్‌ను వంద కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఇకపై వాట్సప్ ఉచితం: చందా అవసరం లేదు

ఫేస్‌బుక్ యాజమాన్యం వాట్సాప్‌ను సొంతం చేసుకున్నాక యూజర్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. వంద కోట్ల యూజర్లు కలిగిన వాట్సప్‌ ద్వారా రోజుకు 42 కోట్ల మెసేజ్‌లను షేర్ చేసుకుంటున్నారు. 1.6 బిలియన్‌ ఫొటోలు షేర్‌ అవుతున్నాయి. 1 బిలియన్‌ గ్రూపులు వాట్సప్‌లో ఉన్నాయి.

English summary
WhatsApp is to cease support for a number of operating systems by the end of 2016, the company announced yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X