వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్‌కు ఏమైంది.. అనుకోని ఎర్రర్‌తో పిచ్చెక్కిపోయిన యూజర్స్...

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సాప్ శుక్రవారం రాత్రి 11గం. ప్రాంతంలో సాంకేతిక సమస్యలతో డౌన్ అయింది. 'టైపింగ్','ఆన్‌లైన్','లాస్ట్ సీన్' వంటి ఫీచర్స్ కనిపించకుండా పోయాయి. అలాగే 'ప్రైవసీ సెట్టింగ్స్','సెక్యూరిటీ సెట్టింగ్స్' కూడా పనిచేయకుండా పోయాయి. భారత్,అమెరికా,యూరోప్ దేశాల్లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వేలాదిమంది వాట్సాప్ యూజర్స్ గందరగోళానికి లోనయ్యారు. చాలామంది ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదులు చేయగా... కొంతమంది నెటిజన్స్ ఫన్నీ ట్వీట్స్‌ పోస్ట్ చేశారు.

వాట్సాప్ సంచలన నిర్ణయం: ఇకపై ఎన్ని మెసేజ్‌లు పంపొచ్చో తెలుసా..?వాట్సాప్ సంచలన నిర్ణయం: ఇకపై ఎన్ని మెసేజ్‌లు పంపొచ్చో తెలుసా..?

డౌన్ డిటెక్టర్ వెల్లడించిన వివరాలు

డౌన్‌డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం ఇప్పటివరకూ 4000 మంది యూజర్స్ వాట్సాప్ సాంకేతిక సమస్యపై ఫిర్యాదు చేశారు. ఇందులో 70శాతం మంది 'లాస్ట్ సీన్' ఫీచర్ కనిపించట్లేదని ఫిర్యాదు చేయగా.. 24శాతం మంది కనెక్షన్ ఇష్యూ‌స్‌పై ఫిర్యాదు చేశారు. ఆండ్రాయిడ్,ఐఓఎస్ వెర్షన్స్ రెండింటిలోనూ ఈ సమస్య తలెత్తింది. అయితే మెసేజింగ్‌కు సంబంధించి మాత్రం ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తలేదు. తాజా ఫిర్యాదులపై వాట్సాప్ యాజమాన్యం ఇంతవరకూ స్పందించలేదు.

గతంలోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలు

గతంలోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలు

జూన్ 16న కూడా ఫేస్‌బుక్,మెసేంజర్,ఇన్‌స్టాగ్రామ్‌‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ డైరెక్ట్‌గా మెసేజ్‌లను పోస్ట్ చేయలేకపోయారు.అంతకుముందు ఏప్రిల్ 12న యూకెలో పీసీ,డెస్క్‌టాప్స్‌లో ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి. ఏప్రిల్ 2న నార్త్&సౌత్ అమెరికాలోనూ ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్.. WhatsApp Chat డైరీ కీలకం, అసలు ఆధారాలు ఇవే !
వాట్సాప్ కొత్త ఫీచర్..

వాట్సాప్ కొత్త ఫీచర్..

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలోనే వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పర్సన్-టు-పర్సన్ పేమెంట్ ఆప్షన్‌ను కొత్తగా వాట్సాప్‌లో చేర్చింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ బ్రెజిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒక్క బ్రెజిల్‌లోనే వాట్సాప్‌కు 120 మిలియన్ యూజర్లు ఉన్నారు. ప్రపంచంలో భారత్ తర్వాత అత్యధిక వాట్సాప్ యూజర్స్ ఉన్నది బ్రెజిల్ దేశంలోనే. భారత్‌లో 400 మిలియన్ వాట్సాప్ యూజర్స్ ఉన్నారు.

English summary
WhatsApp was down for some users on Friday night. As of around 11:00 pm, outrages were reported in India, the US, Europe and other parts of the world. Thousands of users reported issues with WhatsApp, according to the outage tracking website Downdetector.com.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X