వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక "చెక్ పాయింట్"! పంపిన వారిపని అంతే .

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడీయాలో ,ప్రధానంగా వాట్సప్ లో తప్పుడు వార్తల గందరగోళం, ఏది నిజమో ,ఏది అబద్దమో తెలియని ఆయోమయ పరిస్థితి,అది నమ్మాలా లేదా అనే మీమాంస దీనికి తోడు వ్యక్తిగత డ్యామేజ్ చేసేందుకు పోస్టింగ్ లు , ఇన్నాళ్లు వీటీని ఎలా కట్టడి చేయాలో తెలియక అయోమయపడిన పరిస్థితికి , గందరగోళానికి తాజాగా ఫుల్ పెట్టింది వాట్సప్ సంస్థ. ఇందుకోసం "చెక్ పాయింట్ టిప్ లైన్ " అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

<strong>ప్రత్యేక హోదా నిధులు ఎక్కడనుండి తెస్తారు : అరుణ్ జైట్లీ</strong>ప్రత్యేక హోదా నిధులు ఎక్కడనుండి తెస్తారు : అరుణ్ జైట్లీ

"చెక్ పాయింట్ టిప్ లైన్ " ద్వార తప్పుడు ప్రచారానికి బ్రేక్

గత కొద్ది రోజులుగా వాట్సప్ లో తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఆ సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.మరో వైపు ఎన్నికలు జరుగుతున్న వేళ సోషల్ మీడీయా వస్తున్న తప్పుడు సమాచారం పై ఆయా సంస్థలే భాద్యత వహించాలని కేంద్రం ఒత్తిడి తేవడంతో ఆదిశగా వాట్సప్ అడుగులు వేసింది. ఎన్నికల వేళ ఎలాంటీ గందరగోళ విషయాలు,తప్పుడు వార్తలు వచ్చిన ఇట్టే పసిగట్టి వాటికి అడ్డుకట్టవేసేందుకు "చెక్ పాయింట్ టిప్ లైన్ " అనే ఓ వ్యవస్థను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి మనకు వచ్చే సందేశాలపై ఒకవేళ అనుమానాలు ఉంటే చెక్‌పాయింట్ టిప్ ద్వార 9643000888 అనే నెంబర్ కు తెలియజేయవచ్చు.

తప్పుడు వార్తలను ఎనలైజ్ చేసే వాట్సప్ వ్యవస్థ

తప్పుడు వార్తలను ఎనలైజ్ చేసే వాట్సప్ వ్యవస్థ

టిప్‌లైన్ ద్వార వాట్సప్ లో వచ్చే ఫేక్ వార్తలు, వదంతులను సులభంగా తెలుసుకోవచ్చు . ఇందుకోసం వాట్సప్ కు చెందిన టెక్నికల్ ,మరియు పరిశోధన విభాగాలు ఇందుకు సహకరిస్తాయి. కాగా వచ్చిన మెసెజ్ నిజమా ,అబద్దామా తెలుసుకునేందుకు టిప్‌లైన్ ద్వార తెలియజేస్తే, "ప్రోటో " అనే కేంద్రం ద్వార తాము పంపిన మెసెజ్ ను పరీశీలించి అది నిజమైనదో ,కాదో చెబుతుంది. .ఇందుకు సంబంధించి '' నిజం., అబద్దం, తప్పుదోవ పట్టించేది, వివాదాస్పదమైంది అనే ఆప్షన్లతో పాటు ఇది తమ పరిధిలో ఉన్నది లేనిది కూడ టిప్‌లైన్ సెంటర్ వెల్లడిస్తుంది.కాగా ఇది టెక్ట్స్ మెసెజ్ తోపాటు ,వీడీయో, లేదా వీడీయో లింకుల్లో ఉన్న సమాచారాన్ని ఇది విశ్లేషించి చెబుతోంది. కాగా ఇది ఇంగ్లీష్ తోపాటు తెలుగు, హింది, మలయాళం,బెంగాలీ భాషల్లోని మెసెజ్ లకు కూడ ఇది పరీశీలించి చెబుతుంది.

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడీయా పై కేంద్రం సీరియస్

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడీయా పై కేంద్రం సీరియస్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ కమీటి ఒకటి సోషల్ మీడియా వస్తున్న తప్పుడు కథనాలపై ఆయా సంస్థలు చేపడుతున్న చర్యలు పై వాటిని ప్రశ్నించింది.దీంతో ఏలాంటీ ఇబ్బంది జరిగినా వాటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.దీంతో చాల జాగ్రత్తలు చేపట్టాయి సోషల్ మీడీయా సంస్థలు ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ వందలాదీ నకీలీ ఖాతాలను రద్దు చేసింది. ఈనేపథ్యంలోనే వాట్సప్ సైతం ఈ అసత్య కథనాలను కట్డడి చేసేందుకు ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది.

సో ఇక వాట్సప్ లో వస్తున్న మెసెజ్ లు,వీడీయో లతో పాటు వీడీయో లింకులకు వెంటనే ఫార్వార్డ్ చేయకుండా వాటిలో ఉన్న నిజనిజాలను తెలుసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
WhatsApp launched a service for Indians to check the veracity of information, in the messaging platform's latest attempt to combat fake news in India ahead of national elections beginning this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X