వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WhatsApp News:కొత్త ఫీచర్‌ భారత్‌కు ప్రమాదమే..ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. "డిస్సప్పీయరింగ్ మెసేజ్" అనే పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఆప్షన్ ద్వారా యూజర్ పంపిన లేదా రిసీవ్ చేసుకున్న మెసేజ్‌లు పరిమిత కాలం వరకే చాట్ విండోలో కనిపిస్తాయి. అంటే యూజర్ సెట్ చేసుకునే టైమ్ వరకు మాత్రమే అవి చాట్ విండోలో ప్రత్యక్షమవుతాయి. ఆ గడువు ముగిసిన తర్వాత వాటంతటకు అవే మాయమవుతాయి.

WhatsApp news: పరిమితి విధింపుతో ఆ వార్తలు తగ్గాయన్న స్టడీWhatsApp news: పరిమితి విధింపుతో ఆ వార్తలు తగ్గాయన్న స్టడీ

టెస్టింగ్ స్టేజ్‌లో కొత్త ఫీచర్

టెస్టింగ్ స్టేజ్‌లో కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ వర్షెన్ 2.19.275లో ఈ ఫీచర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ తర్వాత ఇన్స్‌టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఈ ఫీచర్ ఉంది. ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయితన తర్వాత అంతర్గతంగా టెస్ట్ చేసి కొంత పరిమితమందికి మాత్రమే ఈ బీటా వర్షన్ విడుదల చేస్తారు. అంటే దీన్ని డెవలప్ చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజుల ప్రయోగం తర్వాత ఏమైనా బగ్స్ వస్తే వాటిని పరిష్కరించిన తర్వాతే మొత్తం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ వర్షెన్‌లో సక్సెస్ అయితే ఐఓఎస్ వర్షెన్‌ కూడా డెవలప్ చేస్తామని వాట్సాప్ తెలిపింది.

 కొత్త ఫీచర్‌లో రెండు ఆప్షన్లు

కొత్త ఫీచర్‌లో రెండు ఆప్షన్లు


"డిస్సప్పీయరింగ్ మెసేజ్" అనే ఈ ఫీచర్‌ను గ్రూప్ సెట్టింగ్స్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని యాజమాన్యం తెలిపింది. "డిస్సప్పీయరింగ్ మెసేజ్" ఫీచర్‌కు సంబంధించి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఆన్/ఆఫ్ ఆప్షన్ రెండోది టైమ్ ఆప్షన్. రెండు టైమ్ స్లాట్లు ఐదు సెకన్లు, ఒక గంట ఉంటాయి. ఒక్కసారి ఆ మెసేజ్ మాయమైందంటే ఇక తిరిగి చూడాలంటే కుదరదని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

 భారత్‌లో ఈ ఫీచర్ అనవసరం?

భారత్‌లో ఈ ఫీచర్ అనవసరం?


"డిస్సప్పీయరింగ్ మెసేజ్" ఫీచర్ భారత్‌లో పనికిరాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే భారత్‌లో చాలా ఫేక్ మెసేజ్‌లు వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని మెసేజ్‌ల ద్వారా ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే మెసేజ్ ఎక్కడి నుంచి సర్క్యులేట్ అయ్యిందో కనుక్కుని సైబర్ పోలీసులు మెసేజ్ సర్క్యులేట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసే వీలుండేది.

 ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలుసుకోవడం కష్టం

ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలుసుకోవడం కష్టం

ఇక "డిస్సప్పీయరింగ్ మెసేజ్" ఫీచర్ వస్తే ఐదు సెకన్లలో లేదా గంటలో ఇలాంటి మెసేజ్ మాయం అవుతే మెసేజ్‌ను తిరిగి చూడలేం కనుక, బూటకపు మెసేజ్‌లకు సంబంధించి ఆధారాలు పోలీసులకు దొరికే అవకాశం లేదు. ప్రస్తుతం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్‌ ఉంది కనుక ఒకవేళ డిలీట్ చేసినా... మెసేజ్ డిలీటెడ్ అని చాట్ విండోలో కనిపిస్తుంది. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేసి సంబంధిత వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంది.

English summary
Instant messaging app WhatsApp is bringing in a new feature called "Disappearing message" where a message will automatically get deleted once the user opts for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X