వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WhatsAPP: లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి...ఎంపీ 4 ఫైలు ద్వారా హ్యాకింగ్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ ఇన్స్‌టాంట్ చాటింగ్ యాప్ వాట్సాప్‌ను వినియోగిస్తున్న వినియోగదారులకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది సైబర్ సెక్యూరిటీ సంస్థ. వెంటనే వాట్సాప్ లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. లేదంటే వాట్సాప్‌లోని వ్యక్తిగత సమాచారం అంతా బయటకు పొక్కే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాట్సాప్‌ డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ ఫీచర్‌లో మార్పులువాట్సాప్‌ డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ ఫీచర్‌లో మార్పులు

 వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్

వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్

కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా (సెర్ట్ ఇన్) అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వాట్సాప్ వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. ఓ MP4 ఫైల్ ద్వారా వాట్సాప్‌లోని సమాచారం హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. గత రెండు నెలలుగా వాట్సాప్‌ వినియోగదారులను టార్గెట్ చేస్తూ వారి సమాచారంను మొత్తం ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ అనే స్పైవేర్ హ్యాకింగ్ చేస్తోందంటూ భారత ప్రభుత్వానికి వాట్సాప్ యాజమాన్యం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారంను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ఓ కోడ్ సృష్టించారని సెర్ట్ ఇన్ సంస్థ హెచ్చరించింది .

MP4 ఫైలు ద్వారా హ్యాకింగ్ అయ్యే ఛాన్స్

MP4 ఫైలు ద్వారా హ్యాకింగ్ అయ్యే ఛాన్స్

హ్యాకింగ్, ఫిషింగ్‌లపై నిత్యం పర్యవేక్షించే సంస్థగా సెర్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ పనిచేస్తోంది. భారత్‌లోని ఇంటర్నెట్ డొమెయిన్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం హ్యాకర్లు సృష్టించిన కోడ్ నుంచి గట్టెక్కాలంటే వినియోగదారులు వాట్సాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలంటూ అలర్ట్ చేసింది. వాట్సాప్‌ను టార్గెట్ చేస్తూ వినియోగదారులకు ఒక ఎంపీ 4 ఫైల్‌ను పంపుతారని తద్వారా వ్యక్తిగత మెసేజ్‌లను రాబడుతారని సెర్ట్‌ ఇన్ సంస్థ తెలిపింది. అయితే బాధిత వినియోగదారుడు నుంచి ఎలాంటి అనుమతి పొందాల్సిన అవసరం లేదని సెర్ట్ తెలిపింది. ఎంపీ 4 ఫైల్ డౌన్‌లోడ్ అయ్యిందంటే చాలు.. క్షణాల్లో సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది.

 ఇప్పటికే హ్యాకింగ్‌కు గురైన వెర్షన్స్ ఇవే

ఇప్పటికే హ్యాకింగ్‌కు గురైన వెర్షన్స్ ఇవే

ప్రస్తుతం ఈ వైరస్ అరడజనుకుపైగా వాట్సాప్ సాఫ్ట్‌వేర్లపై ప్రభావం చూపిందని సెర్ట్ ఇన్ సంస్థ వెల్లడించింది. ఇవి ఆండ్రాయిడ్ 2.19.274 వెర్షన్ నుంచి ఐఓఎస్ వాట్సాప్ 2.19.100 వెర్షన్‌ వరకు ఈ హ్యాకింగ్ బారిన పడినట్లు సెర్ట్ ఇన్ సంస్థ వెల్లడించింది. 2.25.3 వెర్షన్‌కు ముందున్న వాట్సాప్ ఎంటర్‌ప్రైజ్ క్లయింట్‌, 2.18.368 వెర్షన్‌‌కు ముందున్న విండోస్ ఫోన్లు, 2.19.104 వెర్షన్‌కు ముందున్న వాట్సాప్ బిజినెస్ ఆండ్రాయిడ్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురై ఉంటాయని సెర్ట్ వెల్లడించింది.

English summary
An Indian cyber security agency has warned WhatsApp users against a “vulnerability” that can attack this popular social media messaging app and compromise individual system without seeking permissions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X