వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: వాట్సాప్ రూమర్లతో 7గురి హత్య, పోలీసులపై దాడులు

జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలో కొంతమంది పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ వాట్సాప్ లో వదంతలుు వ్యాపించడంతో రెండు వేర్వేరు ఘటనల్లో గ్రామస్థులు కొందరిని పట్టుకొన్ని చితక్కొట్టారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలో కొంతమంది పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ వాట్సాప్ లో వదంతలుు వ్యాపించడంతో రెండు వేర్వేరు ఘటనల్లో గ్రామస్థులు కొందరిని పట్టుకొన్ని చితక్కొట్టారు.ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారు. ఈ కేసులో 19 మందిని అరెస్టుచేశారు పోలీసులు.

వికాస్ కుమార్ వర్మ, గౌతమ్ కుమార్ వర్మ, గంగేష్ గుప్తా అనే ముగ్గురిని నగాడీ అనే ప్రాంతంలో గ్రామస్థులు చితక్కొట్టారు. ప్రాణాలు పోయేవరకు దాడిని ఆపలేదు. వికాస్, గౌతమ్ ల నాయనమ్మపై కూడ దారుణంగా దాడిచేశారు.

WhatsApp Rumours Led To Mob Killing Of 7 In Jharkhand, Say Police

ఇక రాజానగర్ లో కూడ నలుగరు వ్యక్తులను సొసొమౌలి గ్రామస్థులు పట్టుకొన్నారు. వాళ్ళు కిడ్నాపింగ్ గ్యాంగ్ సభ్యులన్న అనుమానంతో కొట్టి చంపేశారు. కొంతమంది వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ శరీ బాగాలను అమ్మెస్తున్నారంటూ వాట్సాప్ లో ప్రచారం జరిగింది. దీంతో అనుమానాస్పదంగా కన్పించిన ఈ ఏడుగురిని గ్రామస్థులు చితక్కొట్టి చంపేశారు.

అయితే ఈ తప్పుడు ప్రచారం కారణంగా గిరిజనులు అనుమానస్పదంగా కన్పించినవారిపై దాడికి దిగారు. పోలీసులు వచ్చినా కూడ వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకొన్నారు. గ్రామస్థులు చేసిన దాడిలో పోలీసులకు కూడ గాయాలయ్యాయి.

పోలీసులు తీసుకొచ్చిన కార్లు, జీపులను కూడ తగులబెటటారు. ఏడుగురి హత్యలు జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలకు సంబంధించిన 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జంషెడ్ పూర్ ప్రాంతంలో వందలాది మంది గ్రామస్థులు పోలీసులతో గొడవపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు.

English summary
At least 19 people have been arrested three days after seven people were beaten to death by a violent mob in two separate incidents in Jharkhand's Singhbhum district over suspicion of being child-lifters, police said. Rumours on social media, according to the police, led to the "unfortunate and unprecedented" incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X