వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ కు రోజుకో తలనొప్పి: కొత్తగా వాట్సాప్ డైరెక్టర్ మెసేజ్ కలకలం; సైబర్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవ సంస్థ వాట్సాప్ ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నామని ప్రకటన చేసిన నాటి నుంచి ఇప్పటివరకు రోజుకో కొత్త రకమైన సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో ఒక సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని నమ్మొద్దని సైబర్ క్రైం విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది .

వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో ఓ మెసేజ్ వైరల్

వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో ఓ మెసేజ్ వైరల్

వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో పంపిన సందేశాన్ని కనీసం 20 మంది కి ఫార్వర్డ్ చేయమని, అలా చేస్తేనే ఉచితంగా వారు వాట్సాప్ సేవలను వినియోగించుకోవడానికి వీలవుతుందని, లేకపోతే వాట్సాప్ సేవలను వినియోగించుకోవడానికి కొంత మొత్తం చెల్లించాలని ఆ సందేశంలో ఉంది. ఇది నిజమేనని నమ్మిన చాలామంది ఈ మెసేజ్ ను పలువురికి ఫార్వర్డ్ చేస్తూ దీనిని వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వాట్సాప్ కు మరో కొత్త సమస్యగా తయారయింది.

 మెసేజ్ షేర్ చెయ్యొద్దని సైబర్ క్రైం విభాగం హెచ్చరిక

మెసేజ్ షేర్ చెయ్యొద్దని సైబర్ క్రైం విభాగం హెచ్చరిక


ఇప్పటికే ప్రైవసీ పాలసీ పై వినియోగదారులకు అనుమానాలు వద్దని, తాము వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఫేస్ బుక్ కు డేటా ని షేర్ చెయ్యం అని వినియోగదారులకు సమాధానం చెప్పుకుంటున్న వాట్సాప్, ఇప్పుడు వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని వెల్లడిస్తోంది. ఎవరూ ఎటువంటి సందేశాలు నమ్మొద్దని, ఎవరికీ ఈ మెసేజ్ ని షేర్ చేయవద్దని ఒకపక్క సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఇంతకీ ఆ సందేశంలో ఏముందంటే

ఇంతకీ ఆ సందేశంలో ఏముందంటే

అసలు ఇంతకీ ఆ సందేశంలో ఏముంది అంటే "దీనిని విస్మరించకుండా జాగ్రత్తగా చదవండి. హలో నేను వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని . ఈ సందేశం మా వినియోగదారులందరికీ, మేము 12 బిలియన్ డాలర్లకు మార్క్ జూకర్ బర్గ్ కు వాట్సాప్ ను విక్రయించాము . వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకర్ బర్గ్ నియంత్రణలో ఉంది. మీరు కనీసం 20 మందికి ఈ మెసేజ్ ని షేర్ చేయండి అప్పుడు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్ బుక్ యొక్క ఎఫ్ తో కొత్త చిహ్నం గా మారడంతో పాటు గా, కలర్ కూడా నీలం రంగులోకి మారుతుంది. అప్పుడు మీ వాట్సప్ కొత్తగా అప్డేట్ అవుతుంది. మీరు ఈ కొత్త వాట్సాప్ ని వినియోగించుకోవాలంటే ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి. లేదంటే వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి అని సందేశం లో ఉంది.

వాట్సాప్ సంస్థలో వరుణ్ పుల్యాని అనే వ్యక్తి లేరు .. ఫేక్ మెసేజ్ లలోనే అతని పేరు

వాట్సాప్ సంస్థలో వరుణ్ పుల్యాని అనే వ్యక్తి లేరు .. ఫేక్ మెసేజ్ లలోనే అతని పేరు


ఇది నిజమని నమ్ముతున్న చాలామంది ఈ మెసేజ్ ను తెగ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో పాటు ఓ యువతి ఆడియో మెసేజ్ కూడా 20 కాంటాక్ట్ లకు సందేశాన్ని పంపకపోతే నెలకు 500 రూపాయలు చెల్లించి వాట్సాప్ వాడుకోవాలి అంటూ వైరల్ అవుతోంది.
అసలు ఇంతకీ నిజం ఏమిటంటే వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ మాత్రమే కాదు, వాట్సాప్ సంస్థలో వరుణ్ పుల్యాని అనే వ్యక్తి లేరు. కానీ ఇలాంటి ఫేక్ మెసేజ్ లలోనే ఆ పేరు బాగా పబ్లిసిటీ అవుతుంది .

సైబర్ నేరగాళ్ళ కుట్ర అంటున్న సైబర్ క్రైం విభాగం ... తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక

సైబర్ నేరగాళ్ళ కుట్ర అంటున్న సైబర్ క్రైం విభాగం ... తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక

ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్ల కుట్ర అని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరిస్తుంది. ఇలాంటి మెసేజ్ లు నమ్మి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దని, అలా ఫార్వర్డ్ చేసిన వారి అకౌంట్ లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ కంపెనీ నుంచి అధికారికంగా వచ్చిన మెసేజ్ లనే నమ్మాలి తప్ప, ఇలా సోషల్ మీడియా లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ లను నమ్మకూడదని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు .

English summary
Facebook messaging service company WhatsApp, a leading social media platform, has been facing new problems on a daily basis ever since it announced that it was taking out a privacy policy. Now A message circulating in social media creating headache to whatsapp users . A message with the name of WhatsApp director Varun Pulyani is has been doing the rounds. It asks users to forward the message to at least 20 contacts. . The cybercrime department has issued warnings not to believe this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X