వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ : డెడ్‌లైన్ ఇదే... యాక్సెప్ట్ చేయని పక్షంలో అకౌంట్ డిలీట్...

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేస్తోంది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలను యాక్సెప్ట్ చేసే యూజర్స్‌కు మాత్రమే వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. లేనిపక్షంలో వారి వాట్సాప్ ఖాతాను తొలగిస్తారు.

Recommended Video

WhatsApp Pay UPI Payments Launched in India వాట్సాప్ ద్వారా డబ్బు చెల్లింపులు...!! | Oneindia Telugu

ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌కి సంబంధించి వాట్సాప్ సంస్థ ఇప్పటికే తమ యూజర్స్‌కు నోటిఫికేషన్స్ పంపించింది. భారత్‌లో బుధవారం(జనవరి 6) చాలామంది యూజర్లకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం... వాట్సాప్ ఇకనుంచి యూజర్స్ డేటాను సేకరిస్తుంది. యూజర్స్ వాట్సాప్ యాక్టివిటీ,వ్యక్తిగత సమాచారం,సర్వీస్,డయాగ్నోస్టిక్,పెర్ఫామెన్స్,బ్యాటరీ లెవల్,సిగ్నల్ స్ట్రెంత్,యాప్ వెర్షన్,బ్రౌజర్ ఇన్ఫర్మేషన్,మొబైల్ నెట్‌వర్క్,ఫోన్ నంబర్,ఐపీ,లాంగ్వేజ్,టైమ్ జోన్,డివైజ్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్‌ తదితర సమాచారాన్ని వాట్సాప్ సేకరిస్తుంది.అంతేకాదు, ఈ డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్ షేర్ చేసుకుంటుంది.

 WhatsApp’s new privacy policy user must accept it otherwise you lose the account

వాట్సాప్ గత ప్రైవసీ పాలసీలో.. 'మీ గోప్యత మా DNA లో కోడ్ చేయబడింది. వాట్సాప్ ప్రారంభించినప్పటి నుండి, మా సేవలను బలమైన గోప్యతా సూత్రాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించాలనుకుంటున్నాము.' అనే వ్యాక్యాలు కనిపించేవి. తాజా పాలసీలో ఈ లైన్స్ లేవు. వాట్సాప్ అనేది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయినప్పటికీ ఆటోమేటిక్ డేటా యాక్సెస్‌ని వాట్సాప్ ప్రైవసీ పాలసీలో పొందుపరచడం గమనార్హం.

కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం... ఎవరైనా యూజర్ తమ వాట్సాప్ ఖాతాను డిలీట్ చేసినంత మాత్రానా అందులోని డేటా తొలగించబడదు. యాప్‌లో 'డిలీట్ మై అకౌంట్ ఫీచర్' అనే ఆప్షన్‌ని ఎంచుకుంటేనే ఆ వాట్సాప్ ఖాతాలోని డేటా తొలగించబడుతుంది. ఒకవేళ ఏవైనా సాంకేతిక కారణాలతో కొన్నిసార్లు మెసేజ్‌లు అవతలివారికి వెళ్లకుండా నిలిచిపోతే... వాట్సాప్ సర్వర్స్‌లో అది 30 రోజుల వరకూ అలాగే ఉంటుంది. ఆ 30 రోజుల తర్వాత కూడా ఆ మెసేజ్‌ డెలివరీ కాకపోతే అప్పుడు అది డిలీట్ అవుతుంది.

వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రైవసీ పాలసీ పట్ల చాలామంది యూజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌లో ఇక ప్రైవసీకి అవకాశం లేకుండా పోతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి 8,2021లోపు యూజర్ యాక్సెప్ట్ చేసి తీరాలి. లేదంటే సదరు యూజర్ వాట్సాప్ ఖాతా తొలగించబడుతుంది.

English summary
WhatsApp’s updated terms of service and privacy policy gives more insight into how the messaging platform will use user data and, more importantly, share it with its parent company Facebook going forward. Users have till February 8, 2021 to accept these in order to continue using the platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X