వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్, బ్యాంకుల గ్రీన్ సిగ్నల్?

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఇప్పటికే కొత్త కొత్త పీచర్లతో వినియోగదార్లను ఆకట్టుకొంటున్న వాట్సాప్...

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఇప్పటికే కొత్త కొత్త పీచర్లతో వినియోగదార్లను ఆకట్టుకొంటున్న వాట్సాప్... యూపీఐ సహాయంతో నగదును ట్రాన్స్ ఫర్ చేసుకొన వెసులుబాటును కూడ కల్పించేందుకు రంగం సిద్దం చేసింది.

యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకొనేలా తమ యూజర్లకు అవకాశం కల్పించేందుకు సిద్దమౌతోంది. ఇప్పటికే వాట్సాప్ దేశీయ బ్యాంకులు, ఇతర ఇన్ స్టిట్యూషన్లతో ప్రాథమిక చర్చలను ప్రారంభించింది.

యూపీఐ ద్వారా తమ మొబైల్ ఫ్లాట్ ఫామ్ పై రెండు బ్యాంకుల మద్య ఇన్ స్టాంట్ ఫండ్ ట్రాన్స్ ఫర్ చేసుకొనే సౌకర్యం కల్పించనుంది. ఈ సేవల ప్రారంభంలో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా వాట్సాప్, ఎస్ బి ఐ, ఎన్ పిసీఐ, ఇతర కొన్ని బ్యాంకులతో చర్చిస్తోంది.

WhatsApp in talks with banks, NPCI to facilitate instant payments via UPI

బ్యాంకులు, ఎన్ పీసీఐతో తమ సిస్టమ్ ను ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో నిర్ణయిస్తోందని సీనియర్ ఎస్బీఐ అధికారులు తెలిపారు. యూపీఐను ఎన్ పీసీఐ రన్ చేస్తోంది. ఈ యూపీఐ ఆధారంగా పనిచేసే పర్సన్ టూ పర్సన్ పేమెంట్ సేవలలను వాట్సాప్ యూజర్లు వినియోగించుకోవచ్చు.

నోట్ల రద్దు తర్వాత దేశాన్ని క్యాష్ లెస్ లేని సోసైటీగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్యాష్ లెస్ సోసైటీలో తాము భాగస్వామ్యం కావాలని సోషల్ మీడియా దిగ్గజాలు నిర్ణయించాయి.

ఈ మేరకు హైక్ మెున్ననే పేమెంట్స్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చాయి. వాట్సాప్ కంటే ముందస్తుగా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టి పేమెంట్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన తొలి మేసేజింగ్ యాప్ గా పేరు తెచ్చుకొంది. అయితే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ ను అమలు చేయాలంటే కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అవసరం కానున్నాయి.

ఒకవేళ దీనికి ఆధార్ ను వాడాలనుకొంటే అప్పుడు తాము బయోమెట్రిక్ అథన్టికేషన్ ఎనేబుల్ చేస్తామని మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం వాట్సాప్ కు భారత్ లో 20 కోట్ల మంది యూజర్లున్నారు. వారిని మరింత పెంచుకొనేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది.

English summary
Facebook-owned messaging application WhatsApp is in discussion with banks to facilitate instant payments via Unified Payment Interface (UPI) for users within its platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X