వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు: ఇలా చేయండి..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారికి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు ఈ సమాచారాన్ని వాట్సాప్ చేరవేసింది.

వాట్సాప్ సేవలు నిలిపివేత..

వాట్సాప్ సేవలు నిలిపివేత..

ఫిబ్రవరి 1 నుంచి ఆండ్రాయిడ్ 2,3, 7అంతకంటే ముందు వెర్షన్, ఐఓఎస్ 8, అంతకంటే ముందు వెర్షన్లతో నడుస్తున్న ఫోన్లతోపాటు అన్ని విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే, ఈ ఫోన్లు వాడుతున్న వినియోగదారులు ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చు.

అప్‌డేట్ చేసుకోకుంటే..

అప్‌డేట్ చేసుకోకుంటే..

అప్‌డేట్ చేసుకోకుంటే గడువు పూర్తయ్యేలోగా తమ చాటింగ్ బ్యాకప్‌ను తీసుకుంటే కీలక సమాచారం పోగొట్టుకోకుండా ఉండవచ్చు. ఈ విధంగా సేవలను నిలిపివేయడం వల్ల పెద్ద సంఖ్యలో వ్యక్తులపై ప్రభావం ఉండకపోవచ్చని.. ఇప్పటికే చాలా మంది ఓఎస్ వెర్షన్లకు మారిపోయారని వాట్సాప్ ఇటీవల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

చాట్ డేటా భద్రపర్చుకుంటే మంచిది

చాట్ డేటా భద్రపర్చుకుంటే మంచిది


ప్రస్తుతం ఐఓఎస్ డివైసెస్‌ రన్నింగ్ ఐఏఎస్9+, ఆండ్రాయిడ్ డివైసెస్ రన్నింగ్ ఓఎస్ 4.0.3+, కై ఓఎస్ 2.5.1+, జియో ఫోన్లలో వాట్సాప్ పనిచేస్తోంది. ఈ వెర్షన్లో వాట్సాప్ ఇక పనిచేయదని పేర్కొంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు జనవరి 31వ రోజునే తమ వాట్సాప్ డేతాను భద్రపరుకుంటే మంచిది.
ఫిబ్రవరి 1 నుంచి పనిచేయని ఆపరేటింగ్ సిస్టమ్స్:
1. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకంటే పాత వెర్షన్లు
2. ఐఓఎస్ 8, అంతకంటే పాతవెర్షన్లు
3. విండోస్ వోఎస్ ఫోన్లు

వినియోగదారులకు మెరుగైన సేవలు

వినియోగదారులకు మెరుగైన సేవలు

డిసెంబర్ 31, 2019 నుంచే విండోస్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయడం లేదు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకే వాట్సాప్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. డార్క్ మోడ్, యానిమేషన్ స్టిక్కర్స్ ఫీచర్స్ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. కాగా, వాట్సాప్ మెసేజ్ యాప్ మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందినదనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా సేవలు అందిస్తున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది.

English summary
At the dawn on February 1, 2020, WhatsApp will withdraw its services from certain devices across the globe. The Facebook-owned messaging app had issued a warning regarding the discontinuation of services in some of the devices supporting older versions of Android and iOS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X