వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సప్‌లో ఇక ముందు నో స్క్రీన్ షాట్స్ ! మరో మూడు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్!

|
Google Oneindia TeluguNews

సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించేలా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లతో ముందుకు రానుంది. యూజర్ ప్రైవసీకి మరింత ఇంపార్టెన్స్ ఇస్తూ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, యానిమేటెడ్ స్టిక్కర్, వాట్సప్ డూడుల్ ఆప్షన్‌‍ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం బీటా టెస్ట్ జరుపుకుంటున్న ఈ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నారు.

ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్

ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్

వాట్సప్‌లో మెసేజెస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. అయినప్పటికీ యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించే దిశగా వాట్సప్ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఫీచర్‌ను రూపొందించింది. దీని ద్వారా వాట్సప్ ఛాట్ స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండదు. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారానే వాట్సప్ యాప్‌ను ఓపెన్ చేసినా మెసేజ్‌ల స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని ఇది బ్లాక్ చేస్తుంది.

వాట్సప్ డూడుల్

వాట్సప్ డూడుల్

వాట్సప్‌లో ప్రస్తుతం స్టిక్కర్స్, ఎమోజీస్‌కు వేర్వేరు ట్యాబ్‌లు ఉన్నాయి. యూజర్లకు ఈ ఇబ్బందిని తప్పించేందుకు టూడుల్ యూఐని రూపొందిస్తోంది. దీని ద్వారా స్టిక్కర్లు, ఎమోజీలు ఒకే గ్రూప్‌లో కనిపిస్తారు. ఫోటోలను ఎడిట్ చేయడం, స్టిక్కర్‌కు డ్రాయింగ్‌ యాడ్ చేసే అవకాశాన్ని డూడుల్ యూఐ కల్పిస్తుంది. యూజర్లు ఎక్కువగా ఉపయోగించే స్టిక్కర్లు, ఎమోజీలను ఫేవరెట్స్‌లో సేవ్ చేసుకునే అవకాశముంది.

యానిమేటెడ్ స్టిక్కర్స్

యానిమేటెడ్ స్టిక్కర్స్

వాట్సప్‌లో ఇప్పటి వరకు మామూలు స్టిక్కర్లే అందుబాటులోకి ఉన్నాయి. త్వరలో రిలీజ్ చేయనున్న ఫీచర్లలో యానిమేటెడ్ స్టిక్కర్లను యాడ్ చేయనున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పాటు వాట్సప్ వెబ్‌లో వీటిని వాడుకునే ఛాన్స్ ఉంది.

స్క్రీన్ షాట్ బ్లాక్‌ ఫీచర్‌పై విమర్శలు

స్క్రీన్ షాట్ బ్లాక్‌ ఫీచర్‌పై విమర్శలు

ఇదిలా ఉంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, స్క్రీన్ షాట్ బ్లాక్ ఫీచర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఫింగర్ ప్రింటే అథెంటికేషన్ ద్వారా యాప్‌కు భద్రత కల్పిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్స్ బ్లాక్ చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ యూజర్లు తమ అవసరం కోసం స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

English summary
Facebook-owned instant messaging app WhatsApp is testing an Authentication feature which would bar users from taking screenshots of their private conversations. The new feature comes as part of a plethora of security changes that the app has been working on and introducing, keeping in line with the app's commitment to user-privacy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X