వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#WhatsNewThisDiwali పేరిట సిటీ బ్యాంక్ క్యాంపెయిన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: భారత్‌లో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. 'ఫెస్టివల్ ఆఫ్ లైట్‌'గా పిలుచుకునే ఈ దీపావళీ పర్వదినాన ఇంటిని చక్కగా అలంకరించుకోవడం, స్నేహితులతో కబుర్లు, మిఠాయిలు పంచుకోవడం, బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు.

మనం ప్రేమించే వారికి బహుమతులను, వారి పట్ల మనకున్న ఆప్యాయతను తెలియ జేయడం కోసం ఈ దీపావళి ఒక అద్భుతమైన పండుగ. దీపావళి పండుగకు మీరు ప్రేమించిన, మిమ్మల్ని ప్రేమించే వారికి బహుమతులు పంపించి మీ శుభాకాంక్షలను తెలియజేయండి.

ఈ ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని బ్యాకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ డిజిటల్ దీపావళి పేరుమీద ఓ క్యాంపెయిన్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్యాంపెయిన్ నవంబర్ 1 నుంచి దీపావళి పండుగ ముగింపు రోజు వరకు కొనసాగుతుంది.

బ్యాకింగ్ సేవలను అందిస్తోన్న సిటీ బ్యాంక్ ఈ దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ (ఫ్లిప్‌కార్ట్, అమెజాన్), ట్రావెల్ (మేక్ మై ట్రిప్), ఎలక్ట్రానిక్స్ (విజయ్ సేల్స్, ఆపిల్), గ్రోసరీ (రిలయన్స్ ఫ్రెష్, సూపర్ మార్ట్) ద్వారా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.

whatsnewthisdiwali-citibank-celebrated-diwali-with-a-twist

#WhatsNewThisDiwali క్యాంపెయిన్ గురించి తెలుసుకోండి:

దీపావళి పండగను పురస్కరించుకుని సిటీ బ్యాంక్ తొలి రోజు ఢిల్లీలోని సాకెత్ మాల్‌లో వాస్తవిక దీపావళిని నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. టపాసులు కాల్చకుండా సంతోషకరమైన దీపావళిని ఎలా జరుపుకోవాలో వినియోగదారులకు తెలియజేస్తుందన్నమాట.

టెక్నాలజీ ద్వారా ఈ ఏడాది దీపావళిని వినూత్నంగా జరుపుకోవాలనుకునే కస్టమర్లను సిటీ బ్యాంక్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. సిటీ బ్యాంక్ డిజిటల్ దీపావళి కాన్సెప్ట్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది కస్టమర్లు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఈ క్యాంపెయిన్‌ను నిర్వహించడానికి గల ముఖ్య కారణం సోషల్ మీడియా పవర్ ఏంటో సామాన్య ప్రజలకు సైతం తెలియజేసేందుకేనని సిటీ బ్యాంకు పేర్కొంది. చాలా మంది కస్టమర్లు సిటీ బ్యాంక్ AR Technology కాన్సెప్ట్‌ను ట్విట్టర్‌లో #WhatsNewThisDiwali పేరిట వారి అనుభవాలను పంచుకున్నారు.

మరికొంత మంది అయితే వారి చిన్నతనంలో దీపావళి పండుగను ఎంత అద్భుతంగా నిర్వహించేవారో ట్విట్టర్‌లో ట్వీట్ల రూపంలో పోస్టు చేశారు. అంతేకాదు ఈ కొత్తసంవత్సరానికి సంబంధించిన నూతన ప్రణాళికలను సైతం దీపావళి సందర్భంగా తెలియజేశారు.

సిటీ బ్యాంక్ నిర్వహించిన ఈ క్యాంపెయిన్‌కు దేశ వ్యాప్తంగా అద్భుత స్పందన లభించింది. ప్రేమించిన వారికి తెలియకుండా దీపావళి గిప్ట్‌తో ఆశ్చర్యాన్ని కలగజేసే వీడియో ఇది. దీపావళి రోజున #WhatsNewThisDiwali ట్విట్టర్ ట్యాగ్ పేరుతో ట్రెండ్ అయింది. సుమారు 200 మిలియన్ ఇంప్రెషన్లతో మొదటి స్ధానంలో నిలిచింది.

దీపావళికి పండుగను పురస్కరించుకుని రూపొందించిన వీడియోలను వీడియో షేరింగ్ వెబ్‌సైట్లు అయిన యూట్యూబ్, విడోపియా, వియుక్లిప్ లాంటి వాటిల్లో అప్‌‌లోడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ మూడు వీడియోలను సుమారుగా 5 మిలియన్ మంది వీక్షించారు.

మొదటి మూడు రోజులు #WhatsNewThisDiwali ట్యాగ్‌తో ట్రెండ్ అవగా, నాల్గవ రోజు #Citi బ్రాండ్ నేమ్‌తో ట్రెండ్ అయింది. ఇప్పటి వరకు ఈ క్యాంపెయిన్ 7 మిలియన్‌కు చేరుకుంది.

ఆ తర్వాత నవంబర్ 7న సిటీ బ్యాంక్ మరో బ్రాండ్ వీడియోని విడుదల చేసింది. దీపావళి సందర్భంగా తమ చిన్నారులతో గడిపిన మధురానుభూతలు అందులో ఉన్నాయి. ఈ వీడియో కూడా ట్విట్టర్‌‌లో #WhatsNewThisDiwali, #City పేరిట ట్రెండ్ అయింది.

English summary
Diwali is a largely celebrated festival of India. Also known as the festival of lights, Diwali is associated with shopping for oneself, family and friends, decorating homes, and exchanging gifts and sweets to lighten up the festive spirit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X