వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త‌ల్లి త‌న కుమారుడిని ముద్దాడటాన్ని సెక్స్ అంటారా? మాజీ ముఖ్య‌మంత్రి!

|
Google Oneindia TeluguNews

పాట్నా: స‌మాజ్‌వాది పార్టీ లోక్‌స‌భ స‌భ్యుడు ఆజం ఖాన్ ఇటీవ‌లే లోక్‌స‌భ‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ స‌భ్యురాలు ర‌మాదేవిని ఉద్దేశించిన చేసిన సెక్సీయ‌స్ట్ కామెంట్ల ప్ర‌కంప‌న‌లు త‌గ్గ‌క ముందే- బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, హిందుస్తాన్ ఆవామీ మోర్చా అధినేత‌ జీత‌న్ రామ్ మాంఝీ అచ్చం అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆజం ఖాన్‌ను వెనుకేసుకుని వ‌చ్చే ప్ర‌య‌త్నంలో.. ఆయ‌న మ‌రో చిచ్చు రాజేశారు. కొత్త వివాదానికి తెర లేపారు.

ఆజం ఖాన్ లోక్‌స‌భ‌లో ర‌మాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల్లో ఎలాంటి త‌ప్పూ లేద‌ని మాంఝీ అన్నారు. లోక్‌స‌భలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసినందు వ‌ల్ల క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆజంఖాన్‌ను రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికీ లేద‌ని చెప్పారు. ఆదివారం ఉద‌యం ఆయ‌న పాట్నాలో విలేక‌రుల‌తో మాట్లాడారు.

‘When a mother kisses son, is it sex?’: Jitan Ram Manjhi backs Azam Khan

ఓ త‌ల్లి త‌న కుమారుడిని ముద్దాడుతుంది. ఓ కుమారుడు త‌న త‌ల్లిని అంతే ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటాడు. అన్నా చెల్లెలు, అక్కా త‌మ్ముడు కూడా ప‌ర‌స్ప‌రం ముద్దు పెట్టుకుంటారు. అంత మాత్రాన అది సెక్స్ అవుతుందా? అని ప్ర‌శ్నించారు. ర‌మాదేవిని ఉద్దేశించి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్య‌లు కూడా ఇలాంటివేన‌ని మాంఝీ అన్నారు. మాంఝీ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం చెల‌రేగుతోంది.

English summary
Samajwadi Party (SP) MP Azam Khan whose sexist remark against BJP MP Rama Devi inside Parliament drew widespread criticism, has now found the support of Hindustani Awam Morcha leader and former Bihar Chief Minister Jitan Ram Manjhi. Manjhi, however, seems to have stoked another controversy with his bizarre comment, made in defence of the SP leader. “When a brother and sister meet, they kiss. Does it equal sex? A mother kisses her son and the son kisses his mother. Is that sex? Azam Khan’s statement is misinterpreted. So, he should apologize but not resign,” Manjhi told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X