• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అరుణ్ జైట్లీ మార్క్ నిబద్ధత... పెద్దల సభలో చర్చ కోసం కేవలం రూ.35 వేల ఖర్చు..

|

న్యూఢిల్లీ : ఏదైనా అంశంపై మాట్లాడేందుకు మనం పేపర్ లేదంటే నెట్ .. మరీ అంతలేదంటే సంబంధిత పుస్తకాన్ని రిఫర్ చేస్తాం. అదీ కూడా ఒకటి రెండు తిరగేసి హమ్మయ్య అంటూ కూనిరాగాలు తీస్తాం. మరీ మన ప్రజాప్రతినిధుల చట్టసభల్లో వాదించేందుకు ఎంత శోధన చేస్తారో తెలుసా ..? అందులో కొందరు ఎంత వ్యయం చేస్తారు ? ఎంత సమయం కేటాయిస్తారనే అంశం మీకు తెలుసా ..? వీరిలో ముందువరుసలో నిలిచే ప్రముఖులు దివంగత అరుణ్ జైట్లీ. అవును ఆయన రాజ్యసభలో ఓ చర్చలో పాల్గొనేందుకు ఒకటి కాదు రెండు పుస్తకాల కోసమే ఏకంగా రూ.35 వేలు ఖర్చుచేశారు.

నిఖార్సైన నేత ..

నిఖార్సైన నేత ..

అవును అరుణ్ జైట్లీ .. నిఖార్సైన రాజకీయ నేత, మంచి న్యాయవాది కూడా. ఏ ఆధారం లేనిది వాదించని వ్యక్తిత్వం ఆయనది. న్యాయవాద వృత్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారో ఏమో కానీ .. చట్టసభల్లో కూడా అదే ఖచ్చితత్వంతో మెలిగేవారు. దేశంలో ఓ హైకోర్టు మేజిస్ట్రేట్ అభిశంసన జరిగే చర్చ కోసం జైట్లీ చేసిన కృషి మాటల్లో చెప్పలేం. కలకత్తా హైకోర్టు జస్టిస్ సౌమిత్రా సేన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై 2011లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై తొలుత పెద్దలసభలో చర్చ జరిగింది. అయితే సౌమిత్ర సేన్ నిధులు దుర్వినియోగం చేశారని తేల్చేందుకు జైట్లీ గట్టిగా వాదనలు వినిపించారు. అంతేకాదు రాజ్యసభలో విపక్ష నేతగా సత్యశోధన చేశారు. హైకోర్టు న్యాయమూర్తి అభిశంసన కోసం జైట్లీ పదుల పుస్తకాలను అధ్యయనం చేశారు.

<strong>జైట్లీ మంచి భోజనప్రియుడు...ఆ మేధావి లేనిలోటు పూడ్చలేనిది: అద్వానీ </strong>జైట్లీ మంచి భోజనప్రియుడు...ఆ మేధావి లేనిలోటు పూడ్చలేనిది: అద్వానీ

ముందే పదవీకి రాజీనామా

ముందే పదవీకి రాజీనామా


ఆగస్టు 18, 2011 రోజున రాజ్యసభలో వాదనలు జరిగే సమయంలో అక్కడికొచ్చారు జైట్లీ. ఆయనతోపాటు తాను అధ్యయనం చేసిన పుస్తకాలను కూడా తీసుకొచ్చారు. అవి పదుల సంఖ్యలో .. కొత్తగా ఉండటంతో మిగతా సభ్యలు ఆశ్చర్యపోయారు. సేన్ అభియోగానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు, గట్టిగా వాదించారు. సేన్ అవినీతిపై ఎగువసభలో మోషన్ కూడా పాసైంది. ఇక తనపై చర్యలు తప్పవని భావించారు సౌమిత్ర సేన్. దేశంలో తొలిసారి జడ్జీగా అభిశంసన ఎందుకు అనుకొని .. అవినీతి ఆరోపణలకు సంబంధించి బాధ్యత వహిస్తూ హైకోర్టు మేజిస్ట్రేట్ పదవీకి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో పాసైన మోషన్ .. లోక్‌సభకు కూడా రాలేదు.

 ఉత్తమ పార్లమెంటరీయన్ కూడా

ఉత్తమ పార్లమెంటరీయన్ కూడా

దీంతో అరుణ్ జైట్లీ ఓ నిబద్దత కలిగిన లాయరే కాదు .. ఉత్తమ పార్లమెంటరీయన్ అని నిరూపితం అయ్యింది. జైట్లీని స్వపక్షాలే కాదు విపక్ష నేతలు కూడా అభినందించారు. 2002లో వాజ్ పేయి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు జైట్లీ. ఆ అనుభవాన్ని జోడించి .. సేన్ అభియోగంపై గట్టిగా వాదించారు. దీంతో దెబ్బకు సేన్ తన పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో జైట్లీని బీజేపీలో కీలకనేతగా అభివర్ణిస్తారు. అంతేకాదు బీజేపీ ప్రణబ్ ముఖర్జీ అని కూడా కొనియాడుతారు.

English summary
August 18, 2011 was a watershed day in the Rajya Sabha. Soumitra Sen, a Calcutta high court justice, was on the verge of becoming the first judge in the country to be impeached. Minutes before the proceedings started on the matter, leader of the Opposition Arun Jaitley entered the Upper House with a large number of books. They looked heavy and new. Later, Jaitley told curious reporters that he spent more than Rs 35,000 on books to prepare for the debate that closely resembled a courtroom drama with frequent references to evidence, legal provisions చట్టపరమైన నిబంధనలు and spirited arguments from all sides. The motion was passed by the Rajya Sabha but Sen, accused of misappropriation of funds, resigned before it came up before the Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X