వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్బీ నుంచి లాల్ బహాదూర్ శాస్త్రి అప్పు తీసుకున్నారు, కానీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి కుంకోణం నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దివంగత మాజీ ప్రధాని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5 వేలు రుణం తీసుకున్నారు.

కారును కొనుక్కోవడానికి ఆయన ఆ అప్పు తీసుకున్నారు. అయితే కొద్ది రోజులకే ఆయన మరణించారు. అయితే ఆయన మరణించిన తర్వాత వచ్చిన పింఛనుతో ఆయన లలిత ఆ రుణాన్ని పైసాతో సహా చెల్లించారు.

కారు కొనేందుకు శాస్త్రి రుణం

కారు కొనేందుకు శాస్త్రి రుణం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో అప్పటి విషయాలను లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడుఅనిల్ శాస్త్రి గుర్తు చేసుకున్నారు. తాము ఓ టాంగాలో కొలంబియా పాఠశాలకు వెళ్లేవాళ్లమని, కొన్ని సందర్బాల్లో ఆపీసు కారు వాడేందుకు ప్రయత్నించేవారమని, వ్యక్తిగత పనులకు దాన్ని వాడేందుకు వీలు లేదని నాన్నగారు చెప్పేవారని ఆయన వివరించారు.

ఆఫీసు కారు వద్దనేవారు

ఆఫీసు కారు వద్దనేవారు

ఆఫీసు కారు వాడడానికి వీలు లేకపోవడంతో తమ కుటుంబం తప్పనిసరిగా కారు కొనాల్సిన పరిస్థితిలో పడిందని, 1964లో అప్పటి ప్రధాని ప్రత్యేక సహాయకుడు విఎస్ వెంకట్రామన్ ద్వారా కారు కోసం అన్వేషణ ప్రారంభించామని అనిల్ శాస్త్రి చెప్పారు.

అప్పటి ఫియట్ కారు ధర

అప్పటి ఫియట్ కారు ధర

కొత్త ఫియట్ కారు రూ. 12 వేలు ఉండేదని, నాన్నగారి ఖాతాలో రూ.7 వేలు మాత్రమే ఉన్నాయని, దాంతో ఆయన రుణం కోసం దరఖాస్తు చేయడంతో ఐదు వేల రూపాయలు వచ్చాయని, దాంతో కారు కొన్నామని అనిల్ శాస్త్రి వివరించారు.

శాస్త్రి భార్య చెల్లించారు

శాస్త్రి భార్య చెల్లించారు

లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన మర్నాడే 1966 జనవరి 11వ తేదీన అకస్మాత్తుగా మరణించారు. కాగా, శాస్త్రి పేర ఉన్న రుణాన్ని ఆయన మరణానంతరం ఆయన భార్య లలిత చెల్లించారు. లాల్ బహదూర్ శాస్త్రికి వచ్చిన పింఛనుతోనే ఆ బాకీ తీర్చారు. ఆయన కొనుక్కున్న 1964 మోడల్ ఫియట్ కారు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ఉంది.

English summary
Lal Bahadur Shastri's widow had to sell her pension to repay a Rs 5,000 car loan from the bank that is now trying to recover its dues from Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X