వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఉపవాసం చేసిన నటి శ్రీదేవి!
చెన్నై: శ్రీదేవి సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఉపవాసం చేశారా? అంటే అవుననే అంటున్నారు. రజనీ కొచ్చాడయన్ సినిమా సమయంలో ఆయన అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు.
ఈ విషయం తెలిసిన శ్రీదేవి బాధపడటంతో పాటు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వారం రోజుల పాటు ఉపవాసం కూడా ఉన్నారట.
ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. రజనీకాంత్ - శ్రీదేవిలు ఇరవై సినిమాల్లో నటించారు. శ్రీదేవి చనిపోయిన విషయం తెలియగానే రజనీ స్పందించారు. దేశం గొప్ప సూపర్ స్టార్‌ను కోల్పోయిందని, తాను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయానని చెప్పారు.
Comments
rajinikanth rajini actress sridevi dubai dead death mumbai jhanvi kapoor boney kapoor శ్రీదేవి మృతి నటి బోనీ కపూర్ జాన్వీ కపూర్ రజనీకాంత్ రజినీకాంత్
English summary
Bollywood icon Sridevi’s sudden passing away put the entire country and many parts of the world in a state of shock and grief.
Story first published: Tuesday, February 27, 2018, 14:29 [IST]