వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి: కలాంకు ఊహించని ప్రశ్న, గోంగూర పచ్చడి ఇష్టం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఓ విద్యార్థి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైందట. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 2006 ఫిబ్రవరిలో ఓ విద్యార్థి.. పెళ్లి గురించి కలాంను ప్రశ్నించారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగారు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం... 'సర్, మీరు ఇప్పటి వరకు ఇంకా మీ పార్ట్‌నర్‌ను ఎందుకు ఎంచుకోలేదు?' అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. కాసేపు మౌనంగా ఉన్న కలాం.. మీ అందరికీ మంచి పార్ట్‌నర్‌లు దొరకాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఆయన సమాధానంతో సింగపూర్‌లోని భారతీయ విద్యా భవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నవ్వులు విరబూశాయి. సమాచారం మేరకు, ఓ సందర్భంలో కలాం మాట్లాడుతూ... తాను పెళ్లి చేసుకుంటే, ఇప్పటి వరకు తాను సాధించిన దాంట్లో సగం కూడా సాధించకపోయేవాడినని చెప్పారు.

When a student asked Dr Kalam, 'Why didn't you marry, President?'

ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా కలాం పుట్టిన రోజు

అబ్దల్ కలాం మృతి పట్ల ఐక్యరాజ్య సమితి సంతాపం ప్రకటించింది. భారత రాష్ట్రపతిగా ఆయన ప్రపంచ శాంతి కోసం కాంక్షించారని పేర్కొంది. కలాం పుట్టిన రోజైన అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.

భౌతికకాయాన్ని తిరువనంతపురం తీసుకురావాలని కోరిన ఊమెన్

కలాం భౌతికకాయాన్ని తిరువనంతపురం తీసుకు రావాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. 1960 నుంచి 80 వరకు కలాం ఇస్రోలో పని చేశారని, ఈ రాష్ట్రంతో ఆయనకు ఎనలేని అనుబంధముందని ఊమెన్ అన్నారు.

గోంగూర పచ్చడి, నెయ్యి అంటే ఇష్టం

అబ్దుల్ కలాంకు గోంగూర పచ్చడి, నెయ్యి అంటే ఇష్టం. ప్రకృతి అంటే ప్రాణం. చెట్లు పెంచడం ద్వారా ప్రకృతి సమతుల్యత కాపాడలని ఆయన పలుమార్లు చెప్పారు. పిల్లలు, యువత అంటే ఇష్టం. జీవితంలో ఆయన క్రమశిక్షణతో మెలిగేవారు. ఆయన వీణ కూడా నేర్చుకున్నారు. సంగీతం, పుస్తకాలు అంటే ఇష్టం.

English summary
It happened in February 2006, when the then President Dr A P J Abdul Kalam appeared to have been stumped when the student of an Indian international school asked him why he has not got married, in Singapore, a media report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X