వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప అలా.. కుమార ఇలా.. బలపరీక్షతో పరువుతీసుకున్న సీఎం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధికారానికి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే తమ ప్రభుత్వానికి మద్దతు లేదని తెలిసి కూడా కుమారస్వామి .. బలపరీక్షకు ఎందుకు సిద్ధమయ్యాడు. రాజీనామా చేసి పరువు నిలుపుకుంటే సరిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అలా చేయకుండా కుమారస్వామి బలపరీక్షకు ఎందుకు వెళ్లాడు. అతి విశ్వాసమే అతనిని కొంపముంచిందా ? అంటే ఔననే సమాధానం వస్తోంది.

అప్పుడు అలా ..

14 నెలల క్రితం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. సభలో 224 స్థానాలు ఉండగా బీజేపీ 105 సీట్ల వద్ద ఆగిపోయింది. కొన్ని సీట్ల దూరంలో నిలిచిపోవడంతో .. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు యడ్యూరప్ప గవర్నర్‌ను కలువడం.. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం చక చక జరిగిపోయాయి. అయితే బలం నిరూపించుకోవాలని కోరడంతో వివాదం మొదలైంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో ఎట్టకేలకు బలపరీక్ష చర్చ సందర్భంగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. అయితే యడ్యూరప్ప తనకు బలం లేదని రాజీనామా చేసి .. కాస్త పరువు నిలుపుకున్నారు.

ఇప్పుడు ఇలా ..

ఇప్పుడు ఇలా ..

కుమారస్వామి పరిస్థితి వేరు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల క్యాంపుతో ఉత్కంఠ మొదలైన సంగతి తెలిసిందే. గత మూడు వారాల నుంచి స్థబ్తత కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎట్టకేలకు కాసేపటి క్రితం బలపరీక్ష జరిగింది. కానీ సభలో తనకు బలం లేదని కుమారస్వామికి తెలుసు. అయిన తాను మొండిగా బలపరీక్షకు వెళ్లారు. అయితే అక్కడ ఏమైనా అద్భుతం జరుగుతుందని భావించారా అనే విమర్శలు వస్తున్నాయి. తనకు సంఖ్యా బలం లేకున్నా .. మొండిగా వెళ్లారు. దీంతో 99 సభ్యుల మధ్య ఆగి .. ప్రభుత్వం కూలిపోయినట్టు అధికారికంగా ప్రకటించుకున్నారు. అయితే అదే యడ్యూరప్ప మాత్రం అలా చేయలేదు. తాను పదవీ చేపట్టింది మాత్రం తప్పుగా అయినా .. తప్పుకోవడం మాత్రం గొప్పగా తప్పుకున్నారు. కానీ కుమారస్వామి మాత్రం అలా చేయలేదు.

రెబల్ ఎమ్మెల్యేలతో

రెబల్ ఎమ్మెల్యేలతో

కాంగ్రెస్, జేడీఎస్ నుంచి రెబల్ ఎమ్మెల్యేల సంకీర్ణ ప్రభుత్వ ఆయువు తీసేశారు. లేదంటే కర్ణాటకలో కుమారస్వామి సర్కార్‌కు బ్రేకు వేసే అవకాశం ఉండేది కాదు. తిరుగబాటుదారులను బుజ్జగించేందుకు శతవిధలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగిన ఈసారి పలించలేదు. సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లి ... పడిపోయింది.

English summary
The coalition government collapsed in the Karnataka Assembly. Stopped 4 seats for power. But even Kumaraswamy knew that he did not support his government. There are arguments that resignation and resignation is sufficient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X