• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ వరదలు-అల్లరిచేష్టలు: శ్రమించి వెళ్తే, హెలికాప్టర్‌ను దింపి సెల్ఫీ అడిగి వెళ్లమన్నాడు

By Srinivas
|

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ, మత్స్యకారుల, ఆరెస్సెస్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేరళ జలవిలయం దేశంతో పాటు విదేశాలను కూడా కదిలించింది.

బాధేసింది: కేరళీయులను కాపాడిన వారికి 3వేలు ఇస్తామని సీఎం, తిరస్కరించిన మత్స్యకారులు

ఇలాంటి సమయంలో కొందరు దీనిని మిస్ యూజ్ చేస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు భారీ వరదల్లో ఉన్న మందు బాటిల్స్ కోసం నీటిలోకి దూకి వాటిని బయటకు తీసుకు వచ్చారు. అంతటి విషాధంలో ఆ సమయాన్ని సహాయం కోసం వెచ్చించే బదులు అలా చేయడం బాధాకరమని అంటున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ సహాయం దుర్వినియోగం!

ఎన్డీఆర్ఎఫ్ సహాయం దుర్వినియోగం!

మరో వ్యక్తి అయితే సహాయక సిబ్బందితోనే ఆడుకున్నాడు. ఈ సంఘటన మరీ మరీ దారుణం. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాయి. కానీ వారి సహాయాన్ని ఓ యువకుడు దుర్వినియోగం చేశాడు. దీనిపై సిబ్బందిలోని ఒకరు మీడియాకు వెల్లడించారు.

  కేరళ వరదలు సహాయానికి మలయాళం హీరో పెళ్లి వాయిదా
  ఎర్రరంగు చొక్కా తొలగించి

  ఎర్రరంగు చొక్కా తొలగించి

  కేరళ వరదల్లో ఎంతోమంది చిక్కుకొని అల్లాడుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడటం లేదా వారికి ఆహారం, నీరు ఇవ్వడం చేస్తున్నారు. ఓ చోట తన ఎరుపు రంగు చొక్కాను తొలగించిన ఓ వ్యక్తి సహాయ చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్‌ను చూస్తూ ఊపాడు. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అతను అరుస్తున్నాడని భావించింది.

  ఎంతో శ్రమించి దగ్గరకు వెళ్తే

  ఎంతో శ్రమించి దగ్గరకు వెళ్తే

  అతనికి సహకరించేందుకు హెలికాప్టర్‌ను ఆ యువకుడి దగ్గరకు తీసుకు వెళ్లింది. ఎంతో శ్రమతో హెలికాప్టర్‌ను అతని సమీపానికి తీసుకు వెళ్లారు. కానీ ఆ సమయంలోనే ఆర్మీ ఊహించని విధంగా అతను షాకిచ్చాడు. హెలికాప్టర్ సహా వారు దగ్గరకు రాగానే సదరు యువకుడు తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి, ఓ సెల్ఫీ తీసుకొని, ఆ తర్వాత వారిని ఇక వెళ్లండి అని చెప్పాడు. దీంతో అవాక్కవడం వారి వంతయింది.

  బాధితులను రక్షించేందుకు పెళ్లి మండపానికి చేరుకోని వరుడు

  బాధితులను రక్షించేందుకు పెళ్లి మండపానికి చేరుకోని వరుడు

  ఓ వైపు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, ఆరెస్సెస్ సేవలు అందిస్తోంది. సామాన్యులు కూడా సహకరిస్తున్నారు. కేరళ చెంగనర్‌లోని బుధనూర్‌కు చెందిన 29 ఏళ్ల రంజిత్ అయితే ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. అతని పెళ్లి ఆగస్ట్ 17వ తేదీన ఉంది. ఏడాదిగా తాను ప్రేమిస్తున్న ఆర్యతో వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే పెళ్లి రోజు అతను వరదలో చిక్కుకున్న వారిని ఎంతోమందిని కాపాడాడు. ఇటు రంజిత్, అటు ఆర్య ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లికి అంతా సిద్ధం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ ఆగస్ట్ 15 నాటికే వచ్చారు. ఆగస్ట్ 16వ తేదీనే కుటుంబ సభ్యులను, బంధువులను పెళ్లి జరిగే చోటుకు పంపించారు. కానీ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు రంజిత్ మాత్రం పెళ్లికి మిస్సయ్యాడు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kerala floods: A youth removes his red shirt and waves at the Helicopter for help and with great difficult they descend and when they get close he pulls his mobile out for clicking a Selfie and asks the team to go.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more