వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: కొత్త కేసుల్లో 2వ స్థానం, రికవరీలో 3, మొత్తం మరణాల్లో 8.. దేశంలో కరోనా వైరస్ లెక్కలివే..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరితో యావత్ ప్రపంచం వణికిపోతోంది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కోటి 32 లక్షల 29 వేల 695 మందికి రక్కసి సోకింది. వైరస్ బరినుంచి కొందరు బయటపడగా.. మరికొందరు ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు వైరస్‌తో పోరాడలేక ఆసువులు బాశారు. అయితే కొత్తగా ఎంతమందికి వైరస్ సోకింది, కొత్త కేసులు ఎన్నీ, మరణాలు, రికవరీ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం. పదండి..

అగ్రరాజ్యం ఫస్ట్ ప్లేస్..

అగ్రరాజ్యం ఫస్ట్ ప్లేస్..


కరోనా వైరస్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. యూఎస్‌లో 34 లక్షల 79 వేల 483 మందికి కరోనా వైరస్ ఉంది. తర్వాత 18 లక్షల 87 వేల 959 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ముచ్చటగా మూడోస్థానంలో ఇండియా ఉంది. 9 లక్షల 7 వేల 645 కేసులు ఉన్నాయి. 7 లక్షల పైచిలుకు కేసులతో రష్యా.. 3 లక్షల పైచిలుకు కేసులతో పెరు దేశం ఉంది.

కొత్త కేసుల్లో సెకండ్ ప్లేస్

కొత్త కేసుల్లో సెకండ్ ప్లేస్

కరోనా వైరస్ కేసుల్లో మూడో స్థానంలో ఉన్న ఇండియా.. కొత్త పాజిటివ్ కేసుల్లో మాత్రం సెకండ్ ప్లేస్‌లో ఉంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష 95 వేల 878 పై చిలుకు కేసులు రికార్డయ్యాయి. అమెరికాలో 65 వేల పై చిలుకు కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మాత్రం ఇండియా నిలిచింది. 28 వేల పై చిలుకు కేసులతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్రెజిల్ 21 వేల పైచిలుకు కేసులు.. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా 11 వేల పైచిలుకు కేసులు, ఐదో స్థానంలో రష్యా 6 వేల పైచిలుకు కేసులతో ఉన్నాయి.

24 గంటల్లో మరణాలు

24 గంటల్లో మరణాలు


కరోనా వైరస్ ఒక్కరోజు మరణాల్లో బ్రెజిల్ మొదటి స్ధానంలో ఉంది. 24 గంటల్లో 770 పై చిలుకు మరణాలతో బ్రెజిల్ ఉండగా.. రెండో స్థానంలో భారతదేశం ఉంది. 540 మరణాలతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. 465 మరణాలతో అమెరికా మూడో స్థానంలో, 276 మరణాలతో మెక్సికో నాలుగో స్థానంలో, 203 మరణాలతో ఇరాన్ ఐదో స్థానంలో ఉంది. సీరియస్ క్రిటికల్ ఉన్నవారిలో అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 15 వేల 934 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. భారత్‌లో 8 వేల 944 కేసులతో రెండో స్థానానికి చేరింది. బ్రెజిల్ 8 వేల 318 మందితో మూడోస్థానంలో ఇరాన్ 3 వేల 375 మందితో నాలుగో స్థానంలో రష్యా 2 వేల 300 మందితో ఐదో స్థానాల్లో ఉన్నాయి.

రికవరీలో థర్డ్ ప్లేస్

రికవరీలో థర్డ్ ప్లేస్


కరోనా వైరస్ రికవరీలో కూడ అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఒక్క రోజు 15 లక్షల 48 వేల 459 మంది క్యూర్ అయ్యారు. బ్రెజిల్ 12 లక్షల 13 వేల 512 మంది రెండో స్థానంలో.. ఇండియా 5 లక్షల 72 వేల 112 మందితో మూడో స్థానంలో ఉంది. రష్యా 5 లక్షల 4 వేల 21 మందితో నాలుగో స్థానంలో చిలీ 2 లక్షల 86 వేల 556 మందితో ఐదో స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల్లో కూడా అమెరికా మొదటి స్థానంలో ఉంది. 17 లక్షల 91 వేల 767 మందితో ఫస్ట్ ఉండగా.. బ్రెజిల్ 6 లక్షల 1526 మందితో రెండో స్థానంలో ఉంది. ఇండియా 3 లక్షల 11 వేల 806 మందితో మూడో స్థానంలో ఉంది. రష్యా 2 లక్షల 18 వేల 239 మందితో నాలుగో స్థానంలో.. లక్ష 45 వేల 383 మందితో సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉంది.

మొత్తం మరణాల్లో ఎనిమిదో ప్లేస్

మొత్తం మరణాల్లో ఎనిమిదో ప్లేస్


కరోనా వైరస్ మొత్తం మరణాల్లో కూడా అమెరికా తొలి స్థానంలో ఉంది. దేశంలో మొత్తం లక్ష 38 వేల 247 మంది చనిపోయారు. 72 వేల 921 మరణాలతో బ్రెజిల్ సెకండ్ ప్లేస్, 44 వేల 830 మరణాలతో బ్రిటన్ మూడో స్థానంలో ఉంది. 35 వేల పైచిలుకు మరణాలతో మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. 34 వేల పైచిలుకు మరణాలతో ఇటలీ ఐదో స్థానంలో నిలిచింది. 30 వేల మరణాలతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో, 28 వేల మరణాలతో స్పెయిన్ ఏడో స్థానంలో ఉన్నాయి. 23 వేల పై చిలుకు మరణాలతో ఇండియా ఎనిమిదో స్థానంలో ఉంది.

English summary
new coronavirus positive cases in global india stands second place. recovery rate third place
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X