వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ 2.0..! వర్షాలు పడుతుంటే ఎక్కడున్నారు.. ? సొంత పార్టీ నేతలకు చురకలు..!

|
Google Oneindia TeluguNews

పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత రాహుల్ గాంధీ కోత్త కోణాన్ని అవిష్కరించాడు. ఈ నేపథ్యంలోనే స్వంత పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యాడు. ముంబాయి వరదలు ముంచెత్తుతుంటే మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించాడు.. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు. అప్పుడు పార్టీ బతికి బట్టకడుతుందని వివరించారు.

 మహారాష్ట్ర నేతలతో రాహుల్ సమావేశం

మహారాష్ట్ర నేతలతో రాహుల్ సమావేశం

జర్నలిస్టు గౌరి లంకేష్ కేసులో పరువు నష్టం కేసును ఎదుర్కోంటున్న రాహుల్ గాంధీ నేడు ముంబాయి కోర్టుకు హజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధికి ఎయిర్ పోర్టులో కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు..అనంతరం కోర్టుకు సైతం పలువరు నేతలు రాహుల్ గాంధీతో వెళ్లారు. ముంబాయిలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితులపై రాహుల్ గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలాలు, బలహీనతలను పలువురు నేతలు ఆయనకు వివరించారు...

స్వంత నేతలకే క్లాస్

స్వంత నేతలకే క్లాస్

సమావేశంలో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని నేతలను రాహుల్ గాంధీ ఆదేశించారు. ఇందులో బాగంగానే స్థానిక పార్టీలతో పోత్తులను కూడ కూడగట్టాలని అదేశించారు..ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరీశీలించాని నేతలను కోరారు. ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ఉండడం వల్లే పార్టీకి భవిష్యత్ ఉంటుందంటూ దశనిర్ధేశనం చేశారు. ఈనేపథ్యంలోనే వారం రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్న ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వెంట ఉన్న మల్లిఖార్జున్ ఖార్గేను ఆదేశించారు.

పార్టీ పునర్‌వైభవం పై రాహుల్ దృష్టి

పార్టీ పునర్‌వైభవం పై రాహుల్ దృష్టి

పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వంత పార్టీ నుండే ప్రక్షళన ప్రారంభించాడు. ఇందుకోసం రాహుల్ గాంధీ స్వయంగా పూనుకున్నాడు.. ముందుగా ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి ముందుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం సంవత్సరాల తరబడి పార్టీని అంటిపెట్టుకుంటున్న నేతలకు రాహుల్ చురకలు అంటించారు. పార్టీకి ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ తాను ఒక్కడినే రాజీనామ చేయాలా అంటూ ప్రశ్నించారు. దీంతో పార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు. ఇక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనేంత వరకు ఆయన పార్టీకి ఇంచార్జ్‌గా వ్వవహరిస్తున్నారు.

English summary
Where were you when Mumbai was submerged? We as a party should be on streets helping people when they need us; that’s how party will grow, Rahul Gandhi told Congress leaders in Mumbai on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X