వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొంచిఉన్న మరో 'భారీ' భూకంపం: నేపాల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ తీవ్రత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కదిలించింది. ఇప్పుడు నేపాల్లో వచ్చిన భూకంపై తీవ్రత 7.9గా ఉంది. త్వరలో మరో భారీ భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018కి అటు ఇటుగా ఈ భారీ భూకంపం ఉండవచ్చునని చెబుతున్నారు.

ఈ భూకంపం కూడా సెంట్రల్ హిమాలయాల్లో ఉండవచ్చునని చెబుతున్నారు. తదుపరి ఆ భారీ భూకంపం హిమాలయాల్లోనే ఉండవచ్చునని, దాని ప్రభావం బాగా ఉంటుందని చెబుతున్నారు. నేపాల్లో వచ్చిన భూకంపం తీవ్రత 7.9గా ఉందని, తదుపరి వచ్చే భారీ భూకంపం తీవ్రత 9గా ఉండవచ్చునని అంటున్నారు.

Where Will the Next Big Earthquake Hit?

నేపాల్లో వచ్చిన భూకంపానికి 40 రెట్లు ఆ భారీ భూకంపం ఉండవచ్చునని అంటున్నారు. ఈ భారీ భూకంపం ప్రపంచంలో ఎక్కడైనా రావొచ్చునని, ప్రధానంగా సెంట్రల్ హిమాలయాల్లో రావొచ్చునని అంటున్నారు. భారీ భూకంపం వస్తే హిమాలయ పరిసరాలు దెబ్బతింటాయి.

హిమాచల్ ప్రదేశ్ నుండి వెస్ట్ నేపాల్ వరకు దీని ప్రభావం పడవచ్చునంటున్నారు. అయితే, కచ్చితంగా ఆ భూకంపం ఎప్పుడు వస్తుందో మాత్రం అప్పుడే చెప్పలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లేదా పదేళ్ల తర్వాత రావొచ్చని చెప్పారని సమాచారం.

English summary
Nepal Earthquake: Strong possibility of quake in Central Himalayas; Himachal Pradesh in high strain region, say experts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X