• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రంలో కొలువుదీరేది ఏ ప్రభుత్వం..! ఫలితాలు సమీపిస్తున్న కొద్ది పెరుగుతున్న టెన్షన్..!!

|
  కేంద్రంలో కొలువుదీరేది ఏ ప్రభుత్వం..!.... ప్రజల్లో పెరుగుతున్న ఉత్కంఠ..!! || Oneindia Telugu

  ఢిల్లీ/హైదరాబాద్: కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందోనని ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తుంటే, బీజేపీ మాత్రం తమకు ప్రజలు మళ్లి అధికారం కట్టబెట్టనున్నారని చెబుతోంది. అయితే ఈ రెండు పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీ సీట్లు రావని చెబుతున్నాయి. ఇలా దేశంలో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు చేరలేక పోవడం గమనార్హం.

   కేంద్రంలో వచ్చేది ఏ ప్రభుత్వమో..? ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాలు..!!

  కేంద్రంలో వచ్చేది ఏ ప్రభుత్వమో..? ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాలు..!!

  బీజేపీ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. పైకి ఈ మాటలు అంటున్నా... కూటమిలో ఉన్నవారు చేజారిపోకుండా జాగ్రత్త పడుతూ, కొత్త మిత్రులను వెతుక్కొనే పనిలో కమలనాథులు నిమగ్నమైనట్టు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ మిత్రుల్లోనూ ఇలాంటి విశ్వాసమే వ్యక్తమవుతోంది. ఫలితాలు వెలువడటానికన్నా ముందే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, కలిసొచ్చే మిత్రులను దానికి ఆహ్వానించి కూటమిని పదిలం చేసుకునే పనిలో ఆ పార్టీ ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో మిత్రులు కీలకపాత్ర పోషిస్తారనే వాతావరణం కనిపిస్తోంది.

  గెలుపువై ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపి, కాంగ్రెస్..! ప్రజామోదం ఎవరికో మరి..!!

  గెలుపువై ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపి, కాంగ్రెస్..! ప్రజామోదం ఎవరికో మరి..!!

  మోదీకి సరితూగే నాయకుడు ప్రతిపక్షంలో లేకపోవడమే తమ బలమని, అదే ఊహించని ఫలితాలను తెచ్చిపెడుతుందని కమలనాథులు నమ్ముతున్నారు. హిందీ రాష్ట్రాల్లో తమకు మంచి పట్టుందని చెప్పినా యువత, మధ్యతరగతి ప్రజలు కొంత అసహనంతో ఉండటం గమనార్హం. నోట్లరద్దు, జీఎస్టీ వల్ల ఎక్కువగా నష్టపోయింది మధ్యతరగతి ప్రజలే కావడంతో ఆ ప్రభుత్వం పై కొంత వ్యతిరేకత నెలకొంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.

  మోదీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపి నేతలు..! బీజేపితో ప్రజలు విసిగిపోయారంటున్న కాంగ్రెస్..!!

  మోదీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపి నేతలు..! బీజేపితో ప్రజలు విసిగిపోయారంటున్న కాంగ్రెస్..!!

  దేశానికి మోదీ ఇచ్చిన బలమైన నాయకత్వం, సమర్థ పాలన, జాతీయ భద్రత విషయంలో రాజీపడని వైఖరి తమకు కలిసొస్తాయన్నది బీజేపి నేతల విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ కూడా తామే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అధికారంలోకి వచ్చేది తామేనని బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉండటం కొంత మేర వారికి కలిసొచ్చే సూచన. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలతో ఆ పార్టీపై కూడా ప్రజల్లో పూర్తి విశ్వాసం లేదన్నది నమ్మలేని నిజం.

  రాష్ట్రాల వారీగా అంచనా..! ఎవరి లెక్కలు వారివి..!!

  రాష్ట్రాల వారీగా అంచనా..! ఎవరి లెక్కలు వారివి..!!

  కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటూ వస్తున్నా చేసిందేమీ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలంగాణ నుంచి చంద్రశేఖర్ రావు గట్టి నమ్మకంతో ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో ముందుకెలుతున్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే పైచేయి అంటు అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలతో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  People are looking forward to the formation of any government at the center. If the Congress expresses that congress should comes into the power, the BJP says that the people are giving the power to BJP to retain power.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more