వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్రటెరియట్‌లోకి వెళ్లాలంటే ఆధార్ : భద్రతా కారణాల రీత్యా తప్పనిసరి అన్న ఉత్తరాఖండ్

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్ : సచ్చీవులు ఉండో సచివాలయానికి వెళ్లాలంటే అక్కడ ఆధార్ ఉండాల్సిందే. ఆధార్ లేదంటే మిమ్మల్ని గేటు లోపలికి రానివ్వరు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తెలుపగా .. ఉత్తరాఖండ్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అయితే భద్రతా కారణాలరీత్యా ఈ డిసిషన్ తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆధార్ ఉంటేనే ..

ఆధార్ ఉంటేనే ..

రాష్ట్ర అత్యున్నత అధికార కేంద్రం సచివాలయం. ఏదైనా అవసరం పడి, సామాన్యులు కూడా అక్కడికి వెళుతుంటారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సచివాలయంలోకి ప్రవేశించేవారికి నిబంధనలు ఏమీ లేవు. కానీ ఉత్తరాఖండ్ సర్కార్ మాత్రం ఆధార్ కార్డు ఉంటేనే ప్రజలను పంపిస్తామని గిరిగీసుకుని కూర్చొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది.

అనుమతించం

అనుమతించం

సచివాలయంలోకి రావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని ప్రజలకు ఉత్తరాఖండ్ సర్కార్ సూచింది. ఆధార్ లేకుంటే అనుమతించబోమని తేల్చిచెప్పింది. భద్రతా కారణాల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. నిఘా వర్గాల హెచ్చరికలతో సచివాలయం, రైల్వేస్టేషన్, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పష్టంచేశారు. అయితే సచివాలయంలో అలజడి సృష్టించబోతున్నారనే సమాచారంతో ఆధార్ తప్పనిసరి చేసినట్టు వివరిస్తున్నారు. ప్రజలంతా సహకరించి .. ఆధార్ కార్డు చూపించాలని కోరారు.

 అలా అయితే ఎలా ?

అలా అయితే ఎలా ?

అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఏ చిన్న పని అవసరం ఉన్న సచివాలయానికి వెళ్లామని .. కానీ ఆ సమయంలో ఆధార్ చూపాలనడం సరికాదంటున్నారు. ప్రతీసారి తమ వెంట ఆధార్ ఉంటుందా అని చెప్తున్నారు. భద్రతా కారణాల రీత్యా ఓకే కానీ .. అంటూనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు, ప్రజాసంఘాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై ఆచితూచి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు సహకరించాలని కోరారు.

సుప్రీంలో చుక్కెదురు

సుప్రీంలో చుక్కెదురు

ప్రభుత్వ పథకాలు, లబ్ధి చేకూరే అంశాలకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం చేయడంతో సుప్రీంకోర్టులో చుక్కెదురై సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. బ్యాంకు ఖాతా తెరవడానికి, ఇతర ముఖ్య పనుల కోసం ఆధార్ అడగాలే తప్ప .. ప్రయోజిత పథకాల కోసం అడుగొద్దని స్పష్టంచేసింది. అయితే ఓ రాష్ట్ర సచివాలయంలో ఆధార్ కార్డు చూపమని కోరడం చర్చకు దారితీసింది.

English summary
Uttarakhand govt has suggested that people need to get Aadhaar card in order to come to the Secretariat. Aadhaar concludes that it will not be allowed. స
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X